52 ఏళ్ల మహిళపై అత్యాచారం.. పరువు తీస్తానని బెదిరించి రూ.30 లక్షలు దోపిడీ.. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో..

ABN , First Publish Date - 2022-09-30T20:00:51+05:30 IST

ఆ మహిళ వయసు 52 సంవత్సరాలు.. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. నాలుగేళ్ల క్రితం తన పక్కింటి వ్యక్తికి రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చింది..

52 ఏళ్ల మహిళపై అత్యాచారం.. పరువు తీస్తానని బెదిరించి రూ.30 లక్షలు దోపిడీ.. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో..

ఆ మహిళ వయసు 52 సంవత్సరాలు.. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. నాలుగేళ్ల క్రితం తన పక్కింటి వ్యక్తికి రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చింది.. ఎన్ని సార్లు అడిగినా అతను తిరిగి ఇవ్వలేదు.. రెండేళ్ల తర్వాత డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించి ఆ మహిళను తన ఇంటికి ఆహ్వానించాడు.. ఒంటరిగా వచ్చిన ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. అప్పట్నుంచి ఆమెను బెదిరిస్తున్నాడు.. తను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అత్యాచారం గురించి అందరికీ చెప్పి పరువు తీస్తానని బెదిరించాడు.. దీంతో ఆ మహిళ దఫదఫాలుగా రూ.30 లక్షలు అతడికి ఇచ్చేసింది.. చివరకు కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


ఇది కూడా చదవండి..

పుట్టిన 28 రోజులకే ఘోరం.. మంచంపై నుంచి కిందపడి కూతురు చనిపోయిందంటూ శోకాలు పెట్టిన తల్లి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!


మధ్యప్రదేశ్‌లోని శివపురికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 52 ఏళ్ల మహిళ 2015లో తన పొరుగింట్లో ఉండే మణిరామ్ భార్గవకు రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చింది. తిరిగి అడిగితే అతను ఇవ్వడం లేదు. చివరకు 2017 నవంబర్‌లో డబ్బులు తీసుకునేందుకు తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఒంటరిగా వచ్చిన బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. పాత బాకీ తీర్చకపోగా కొత్తగా డబ్బులు కావాలని అడగడం మొదలుపెట్టాడు. ఇవ్వకపోతే అత్యాచారం గురించి అందరికీ చెప్పి పరువు తీస్తానని బెదిరించేవాడు. దీంతో మణిరామ్ అడిగినప్పుడల్లా ఆ మహిళ డబ్బు ఇస్తూ ఉండేది. 


బాధిత మహిళ నుంచి మణిరామ్ ఐదేళ్లలో దాదాపు రూ.30 లక్షల వరకు తీసుకున్నాడు. ఇంట్లో డబ్బు కనిపించకపోవడంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. డబ్బు ఏమైందని ప్రశ్నించగా.. ఆ మహిళ అసలు విషయం చెప్పేసింది. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు మణిరామ్ భార్గవపై అత్యాచారం, దోపిడీ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు మణిరామ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Read more