-
-
Home » Prathyekam » Man make fake IDs in the name of girls on social media used to send obscene messages sgr spl-MRGS-Prathyekam
-
అమ్మాయిల పేరుతో ఫేస్బుక్లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి అసభ్యకరంగా చాటింగ్.. ఇప్పుడు ఈ కుర్రాడి పరిస్థితి ఏంటంటే..
ABN , First Publish Date - 2022-07-19T22:10:13+05:30 IST
ఆ యువకుడు అమ్మాయి పేరుతో ఫేస్బుక్(Face Book)లో అకౌంట్ ఓపెన్ చేశాడు.

ఆ యువకుడు అమ్మాయి పేరుతో ఫేస్బుక్(Face Book)లో అకౌంట్ ఓపెన్ చేశాడు. పలువురు యువతులకు, మహిళలకు ఆ ఐడీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపేవాడు. వారు యాక్సెప్ట్ చేసిన తర్వాత వారితో ఛాటింగ్ మొదలుపెట్టేవాడు. మొదట సాధారణ మెసేజ్‌లే పంపేవాడు. ఆ తర్వాత అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్‌లు పంపేవాడు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే అదే మహిళల ఫోటోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి పంపేవాడు. ఇటీవల ఓ విద్యార్థిని అతడి గురించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాఫ్తు సాగించిన సైబర్ సెల్ బృందం నిందితుడిని అరెస్టు చేసింది.
ఇది కూడా చదవండి..
ఓ ట్రాన్స్‌జెండర్‌తో ఓ యువకుడి అసహజ బంధం.. రహస్యం బయటపడుతుందేమోనని అతడి భయం.. చివరకు ఊహించని సీన్..!
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఒక విద్యార్థిని 15 రోజుల క్రితం రాష్ట్ర సైబర్ సెల్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల క్రితం తనకు అనిత పేరుతో ఉన్న ఫేస్బుక్ ఐడీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందని, ఆ ఐడీకి తన స్నేహితులు చాలా మంది అటాచ్ అయి ఉండడంతో తాను కూడా యాక్సెప్ట్ చేశానని చెప్పింది. మొదట్లో కొన్ని రోజులు ఆ ఐడీ నుంచి సాధారణ మెసేజ్‌లు వచ్చాయని, ఆ తర్వాత అసభ్యకర ఛాటింగ్ మొదలైందని తెలిపింది. అయితే ఆ ఛాటింగ్‌కు తాను స్పందించకపోవడంతో అదే ఐడీ నుంచి తనకు మెసెంజర్లో అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు, వీడియోలు వచ్చాయని తెలిపింది.
అసభ్యకరమైన ఛాటింగ్ ఎంతకీ ఆగకపోవడంతో ఆ విద్యార్థిని రాష్ట్ర సైబర్ సెల్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన సైబర్ పోలీసులు నిందితుడిని రాజస్థాన్‌లోని జుంజునులో ఉన్న వికాస్‌గా తేల్చారు. అతడి కోసం15 రోజుల పాటు పలు రాష్ట్రాల్లో గాలించిన పోలీసులు తాజాగా పట్టుకున్నారు. నిందితుడు నకిలీ ఐడీలు తయారు చేసి వందలాది మంది అమ్మాయిలకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడని సైబర్ సెల్ విచారణలో తేలింది.