Shocking: ఐదేళ్ల క్రితం ముక్కు పుడక పోగొట్టుకున్న వ్యక్తి.. చివరకు అది ఎక్కడ కనిపించిందంటే..

ABN , First Publish Date - 2022-09-25T01:55:54+05:30 IST

అతను ఒక ఫ్యాషన్ ఆర్టిస్ట్.. చాలా ఏళ్ల క్రితం ఎంతో ఇష్టంగా ఓ రింగ్ ((Nose Ring) చేయించుకుని దానిని తన ముక్కుకు అలంక‌రించుకున్నాడు.

Shocking: ఐదేళ్ల క్రితం ముక్కు పుడక పోగొట్టుకున్న వ్యక్తి.. చివరకు అది ఎక్కడ కనిపించిందంటే..

అతను ఒక ఫ్యాషన్ ఆర్టిస్ట్.. చాలా ఏళ్ల క్రితం ఎంతో ఇష్టంగా ఓ రింగ్ ((Nose Ring) చేయించుకుని దానిని తన ముక్కుకు అలంక‌రించుకున్నాడు. ఐదేళ్ల క్రితం అది కనిపించకుండా పోయింది. దాని కోసం అతను ఇల్లంతా వెతికాడు. తనకు సంబంధించిన అన్ని ప్రదేశాల్లోనూ అన్వేషించాడు. ఇద్ద‌రు మ‌నుషుల‌ను పెట్టి మరీ వెతికించాడు. అయినా అది క‌నిపించ‌కపోవడంతో దాని గురించి మర్చిపోయాడు. చివరకు అది తన ఊపిరితిత్తుల్లోనే ఉందని, దాని కారణంగానే తాను అనారోగ్యం పాలయ్యానని తెలుసుకుని షాకయ్యాడు. 


ఇది కూడా చదవండి..

Viral Video: చిలుక ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. నిద్రపోతున్న శునకాన్ని లేపడానికి ఈ చిలుక ఏం చేసిందో చూడండి..


అమెరికాకు చెందిన Piercing Artist జో లికిన్స్ చాలాకాలం నుంచి ద‌గ్గు, ఆయాసంతో ఇబ్బందిప‌డుతున్నాడు. ద‌గ్గు మందులు వేసుకుంటున్నా సమస్య తగ్గడం లేదు. రోజు రోజుకూ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. చివరకు ఏ ప‌నీ చేసుకోలేని స్థితికి వ‌చ్చాడు. దీంతో ఇటీవల ఓ స్నేహితుడి సహాయంతో హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్క‌డ అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు చేసిన వైద్యులు ఊపిరితిత్తుల్లో నోస్ రింగ్ చిక్కుకుందని, వెంటనే ఆప‌రేష‌న్ చేసి దానిని తొలగించాలని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేసి దానిని బయటకు తీశారు. ఇన్నేళ్లుగా ఆ రింగ్ లోపల ఉన్నా ఊపిరితిత్తులను చీల్చకుండా ఉండడం అదృష్టమేనని వైద్యులు చెబుతున్నారు. 


`డాక్టర్ నా ఊపిరితిత్తుల ఎక్స్-రే చూపించినపుడు చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎంతగానో వెతికిన నోస్ రింగ్ నా ఊపిరితిత్తుల్లోనే ఉందని తెలిసి షాకయ్యాను. సర్జరీ చేసి ఆ రింగ్‌ను డాక్టర్లు బయటకు తీశారు. అన్నేళ్లు లోపల ఉన్నా అది నా ఊపిరితిత్తులను డ్యామేజ్ చేయలేదు. ఆ రింగ్‌ను భద్రంగా దాచుకున్నాను. దానిని మాత్రం మళ్లీ ధరించన`ని లికిన్స్ తెలిపాడు. 

Updated Date - 2022-09-25T01:55:54+05:30 IST