బయట ఆడుకుంటున్న బాలుడు హఠాత్తుగా అదృశ్యం.. ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసి అవాక్కైన పోలీసులు!

ABN , First Publish Date - 2022-07-08T20:55:55+05:30 IST

ఆ ఎనిమిదేళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు.. కొద్దిసేపటికి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు..

బయట ఆడుకుంటున్న బాలుడు హఠాత్తుగా అదృశ్యం.. ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసి అవాక్కైన పోలీసులు!

ఆ ఎనిమిదేళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు.. కొద్దిసేపటికి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు.. చుట్టు పక్కల వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు.. దీంతో ఆ బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇంటికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.. కన్న తండ్రే ఆ బాలుడిని కిడ్నాప్ చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్పష్టమైంది.. దీంతో పోలీసులు అతడి కోసం అన్వేషిస్తున్నారు.  Chhattisgarhలోని రాయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

America: ట్రక్కులో 53 మంది ప్రాణాలు బలి.. అదే ట్రక్కులో ఉన్న మహిళ బతికుండడానికి కారణం ఏంటి?


రాయ్‌పూర్‌ లోని హిమాలయన్ హైట్స్ కాలనీకి చెందిన లోకేష్ సింగ్ అనే వ్యక్తి తన భార్యతో గొడవ పడి వేరుగా ఉంటున్నాడు. లోకేష్ నుంచి విడాకులు కావాలని కోరుతూ అతని భార్య కోర్టుకు వెళ్లింది. వీరికి యుగ్విహాన్ అనే ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. కొడుకు సంరక్షణ బాధ్యతను కోర్టు తల్లికే అప్పగించింది. ఆమె తన కొడుకుతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవాలని లోకేష్ తన భార్యను వేధిస్తున్నాడు. తన భార్యను బెదిరించేందుకు గతంలోనే కొడుకును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు కుదరలేదు. 


తాజాగా ఇంటి బయట కొడుకు ఆడుకుంటుండడం చూసి ఆ బాలుడిని కిడ్నాప్ చేసి సుమోలో వెళ్లిపోయాడు. ఎంత సేపటికీ కొడుకు లోపలికి రాకపోవడంతో తల్లి కంగారు పడింది. ఎక్కడా కొడుకు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రే కిడ్నాప్ చేశాడని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తేలింది. తన కొడుకుని లోకేష్ మధ్యప్రదేశ్ కి తీసుకెళ్లి ఉండవచ్చని తల్లి అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు ఒక బృందాన్ని మధ్యప్రదేశ్ పంపించారు. ప్రస్తుతం లోకేష్ కోసం గాలింపులు చేపడుతున్నారు. 


Read more