నాకీ పెళ్లి వద్దంటూ బావిలోకి దూకిన యువకుడు.. పైకి లాగి మరీ పెళ్లి చేసేశారు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-12-12T15:38:55+05:30 IST

బీహార్‌లోని ఛప్రా జిల్లాలో ఓ విచిత్ర వివాహం జరిగింది. ఛప్రా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు తన ప్రియురాలిని (22) కలిసేందుకు శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. అమ్మాయి కుటుంబ సభ్యుల కంట పడ్డాడు. వారిని చూసి భయంతో బావిలోకి దూకాడు.

నాకీ పెళ్లి వద్దంటూ బావిలోకి దూకిన యువకుడు.. పైకి లాగి మరీ పెళ్లి చేసేశారు.. అసలు కథేంటంటే..

బీహార్‌లోని (Bihar News) ఛప్రా జిల్లాలో ఓ విచిత్ర వివాహం జరిగింది. ఛప్రా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు తన ప్రియురాలిని (22) కలిసేందుకు శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. అమ్మాయి కుటుంబ సభ్యుల కంట పడ్డాడు. వారిని చూసి భయంతో బావిలోకి దూకాడు. యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆ యువకుడిని బావి నుంచి బయటకు లాగారు. అనంతరం బలవంతంగా ఆ యువతితో యువకుడికి వివాహం జరిపించారు. ఆ యువకుడు ఏడుస్తూనే ఆ యువతి మెడలో తాళి కట్టాడు.

మోతిరాజ్‌పూర్‌కు చెందిన మున్నా కుమార్, సోనీ కుమారి మధ్య నాలుగేళ్లుగా ఎఫైర్ నడుస్తోంది. మున్నా తన ప్రియురాలిని కలిసేందుకు తరచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు. శుక్రవారం అర్ధరాత్రి కూడా అలాగే వెళ్లాడు. అయితే మున్నాను సోనీ కుటుంబసభ్యులు చూసేశారు. వారిని చూసిన భయంతో మున్నా సమీపంలోని బావిలోకి దూకాడు. గ్రామస్థులు, సోనీ తల్లిదండ్రులు బావి నుంచి మున్నాను బయటకు తీసి అతడి ప్రాణాలను కాపాడారు. ఆ తర్వాత పంచాయితీ పెట్టారు. పంచాయితీ పెద్దలు సోనీని వివాహం చేసుకోవాలని మున్నాకు చెప్పారు.

సోనీని వివాహం చేసుకునేందుకు మున్నా అంగీకరించలేదు. ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాడు. అయితే సోనీ మాత్రం మున్నాను తప్ప మరెవరినీ వివాహం చేసుకోనని చెప్పింది. దీంతో గ్రామపెద్దల బలవంతం మేరకు సోనీ మెడలో మున్నా తాళి కట్టాడు.

Updated Date - 2022-12-12T15:38:55+05:30 IST

Read more