Viral Video: భార్య అంటే భయమా? లేక ప్రేమా?.. షోరూంలో ఇతడు చేసిన పని చూసి నెటిజన్ల సందేహం!

ABN , First Publish Date - 2022-10-14T17:51:07+05:30 IST

అతడికి సుమారు 50ఏళ్ల వయసు ఉంటుంది. తన భార్యతోపాటు కలిసి స్థానికంగా ఉన్న ద్విచక్ర వాహన షోరూమ్‌కు వెళ్లాడు. అక్కడ బండిని కొనుగోలు చేశాడు. అనంతరం అతడు చేసిన పని ప్రస్తుతం నవ్వులు పూయిస్తోంది. అందుకు సంబంధించిన దృశ్యాలు

Viral Video: భార్య అంటే భయమా? లేక ప్రేమా?.. షోరూంలో ఇతడు చేసిన పని చూసి నెటిజన్ల సందేహం!

ఇంటర్నెట్ డెస్క్: అతడికి సుమారు 50ఏళ్ల వయసు ఉంటుంది. తన భార్యతోపాటు కలిసి స్థానికంగా ఉన్న ద్విచక్ర వాహన షోరూమ్‌కు వెళ్లాడు. అక్కడ బండిని కొనుగోలు చేశాడు. అనంతరం అతడు చేసిన పని ప్రస్తుతం నవ్వులు పూయిస్తోంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఓ వ్యక్తి కొన్నేళ్లుగా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన భార్యతో కలిసి స్థానికంగా ఉన్న షోరూమ్‌ను సందర్శించాడు. అక్కడ టీవీఎస్ ఎక్సల్‌ను కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా షోరూమ్ సిబ్బంది.. ఓ పూల దండను అతడి చేతికి అందించారు. దాన్ని కొత్తగా కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనానికి వేయాలని సూచించేలోపే.. ఆ వ్యక్తి అక్కడున్న వారికి షాకిచ్చాడు. పూల దండను నేరుగా తీసుకెళ్లి, వాహనం పక్కన నిల్చున్న తన భార్య మెడలో వేయబోయాడు. ఇంతలో సిబ్బంది సూచన విని.. తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అనంతరం తాను కొనుగోలు చేసిన వాహనానికి పూల దండ వేశాడు. భర్త చేష్టలను చూసి ఆ భార్య ఒక్కసారిగా నవ్వింది. ఈ దృశ్యాలను అక్కడున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ‘భార్య అంటే భయమా? లేక ప్రేమా?’ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 




Read more