-
-
Home » Prathyekam » Man gets crushed while trying to repair car video gone viral sgr spl-MRGS-Prathyekam
-
Shocking Video: కారు రిపేరు చేస్తుండగా ఊహించని దారుణం.. ముందుకు దూసుకొచ్చిన కారు కింద పడి..
ABN , First Publish Date - 2022-09-18T01:09:04+05:30 IST
ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవ్వరూ చెప్పలేరు. అతిజాగ్రత్త వల్ల లేదా అజాగ్రత్త వల్ల ప్రమాదాలు సంభవిస్తుంటాయి.

ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవ్వరూ చెప్పలేరు. అతిజాగ్రత్త వల్ల లేదా అజాగ్రత్త వల్ల ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Viral Video) ఓ వ్యక్తి కారును రిపేరు చేస్తూ దాని కిందే పడి నలిగిపోయాడు. ఆ వీడియో ఎంతో మందిని షాక్‌కు గురి చేస్తోంది. ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును స్టార్ట్ చేశాడు. అయితే అది ముందుకు కదల లేదు. దాంతో అతడు కిందకు దిగి రిపేర్ చేసేందుకు కారు బానెట్ ఓపెన్ చేశాడు. తిరిగి కారు లోపలికి వెళ్లి ఇంజిన్ ఆన్ చేశాడు. తర్వాత బయటకు వచ్చి ఇంజన్‌ను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా కారు ముందుకు కదలింది. దాంతో కారుకు, వెనకున్న షట్టర్‌కు మధ్యలో అతను ఇరుక్కుపోయాడు.
అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వెంటనే స్పందించి అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. అది ఆటోమేటిక్ గేర్ బాక్స్ (Auto Gearbox) ఉన్న కారు కావడం వల్లే ఆ ప్రమాదం సంభవించింది. ఈ వీడియోను దీపక్ ప్రభు అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. `ఆటోమేటిక్ వాహనం చెడిపోయినట్లయితే.. దాని ముందు ఎప్పుడూ నిలబడకండి. ఈ వీడియో చూపించి మీ స్నేహితులను, బంధువులను హెచ్చరించండి` అని ఆయన కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.