భార్య ఉండగా మరో యువతితో ప్రేమ వ్యవహారం.. అర్ధరాత్రి ప్రేయసిని ఇంటికి పిలిచి భార్యను దారుణంగా..

ABN , First Publish Date - 2022-05-30T08:54:58+05:30 IST

ఆ యువకుడికి ఇంట్లో ఇష్టంలేని పెళ్లి చేశారు. వివాహం జరిగిన తరువాత కూడా అతను ప్రేయురాలిని పొందాలనుకున్నాడు. అందుకోసం భార్యను ప్రేయసి ముందే హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది...

భార్య ఉండగా మరో యువతితో ప్రేమ వ్యవహారం.. అర్ధరాత్రి ప్రేయసిని ఇంటికి పిలిచి భార్యను దారుణంగా..

ఆ యువకుడికి ఇంట్లో ఇష్టంలేని పెళ్లి చేశారు. వివాహం జరిగిన తరువాత కూడా అతను ప్రేయురాలిని పొందాలనుకున్నాడు. అందుకోసం భార్యను ప్రేయసి ముందే హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని నగ్లా హవేలి ప్రాంతానికి చెందిన ఉపేంద్ర(27) అనే యువకుడు ప్రీతి(25) అని యువతిని అయిదు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. కానీ ఉపేంద్ర పెళ్లికి ముందే మరో యువతిని ప్రేమించాడు. తల్లిదండ్రులు బలవంతం చేయడంతో ప్రీతిని పెళ్లి చేసుకున్నాడు. ఉపేందర్ పెళ్లి చేసుకున్న సంగతి అతని ప్రేయసికి తెలియడంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.


కానీ ఉపేంద్ర ఎలాగైనా ప్రియురాలిని పొందాలనుకున్నాడు. ఆమె పట్ల తన ప్రేమను నిరూపించుకోవడానికి ఒక దారుణమైన ప్లాన్ వేశాడు.  ఒకరోజు అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయిన తరువాత ప్రియురాలిని ఇంటికి పిలిచాడు. ఆ తరువాత ఆమె ముందు నిద్రపోతున్న తన భార్య ప్రీతి గొంతుకోసి హత్యచేశాడు. ప్రీతి అరుపులకు ఉపేంద్ర తండ్రి నిద్రలేచి వెళ్లగా.. అక్కడ ఉపేందర్ తన ప్రియురాలితో ఉన్నాడు. ప్రీతి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. 


ఉపేంద్ర తండ్రి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు రాకముందే ఉపేంద్ర ప్రేయసి అక్కడి నుంచి పారిపోయింది. పోలీసులు ఉపేంద్రను అరెస్టు చేసి అతనిపై హత్య కేసు నమోదు చేశారు. ప్రీతి తల్లిదండ్రులు ఉపేంద్రపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టారు. ప్రీతి హత్య కేసులో ఉపేంద్ర ప్రియురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.Read more