వదినను హత్య చేసిన మరిది.. కారణం ఏంటో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-04-05T09:00:16+05:30 IST

ఆ యువకుడికి గతంలో రెండు వివాహాలు జరిగాయి. భార్యలిద్దరూ అతడిని వదిలి వెళ్లిపోయారు. వాళ్లిద్దరూ వెళ్లిపోవడం వెనుక వదిన హస్తం ఉందని భావించిన యువకుడు ఆమెపై పగ ...

వదినను హత్య చేసిన మరిది.. కారణం ఏంటో తెలిస్తే షాక్!

ఆ యువకుడికి గతంలో రెండు వివాహాలు జరిగాయి. భార్యలిద్దరూ అతడిని వదిలి వెళ్లిపోయారు. వాళ్లిద్దరూ వెళ్లిపోవడం వెనుక వదిన హస్తం ఉందని భావించిన యువకుడు ఆమెపై పగ పెంచుకున్నాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి ఆమెను ఏం చేశాడంటే..


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో పాటి పోలీస్ స్టేషన్ పరిధిలో జస్మా బాయి అనే మహిళ సోమవారం హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. హత్య జరిగినట్టు నిర్ధారించి వెంటనే విచారణ ప్రారంభించారు. కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారితో పోలీసులు మాట్లాడారు. దాంతో జస్మా బాయి, ఆమె మరిది భుర్లా మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. భూర్లా అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కానీ భార్యలు ఇద్దరూ అతన్ని విడిచి వెళ్లిపోయారు. 


వారు తనను వదిలేయడం వెనుక జస్మా బాయి ఉందని భుర్లా అనుమానించి ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం కోసం ఎదురు చూసి గత సోమవారం ఇంట్లోకి ప్రవేశించి ఆమెను హత్య చేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Read more