ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ.. ఒకరు చేసిన తప్పుకి మరొకరు బలి

ABN , First Publish Date - 2022-01-03T12:10:53+05:30 IST

వారిద్దరూ మంచి స్నేహితులు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. కానీ ఆ ఇద్దరు పురుషులు. అదే వారి ప్రేమ పాలిట శాపంగా మారింది. ఒకరు చేసిన తప్పుకి మరొకరు ప్రాణాలు వదలాల్సివచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ.. ఒకరు చేసిన తప్పుకి మరొకరు బలి

వారిద్దరూ మంచి స్నేహితులు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. కానీ ఆ ఇద్దరు పురుషులు. అదే వారి ప్రేమ పాలిట శాపంగా మారింది. ఒకరు చేసిన తప్పుకి మరొకరు ప్రాణాలు వదలాల్సివచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ నగరానికి చెందిన హిమాన్షు శర్మ ఒక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలం క్రితం అతనికి పక్కగ్రామం బీజల్‌పూర్‌లో నివసించే అమన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఇద్దరి అభిరుచులు ఒకటే కావడం ఎక్కువ సమయం తోడుగా గడిపేవారు. అలా.. ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొంతకాలం సహజీవనం కూడా చేశారు. కానీ వారి ప్రేమకు లోకం అడ్డుపడింది.


ఇద్దరి మధ్య సంబంధం గురించి అమన్ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు అమన్ సోదరులు, తండ్రి హిమాన్షు ఇంటికి వచ్చి అమన్‌ నుంచి ఇకనుంచి దూరంగా ఉండమని హెచ్చారించారు. అప్పటి నుంచి అమన్ కూడా హిమాన్షు వద్దకు రావడం మానేశాడు. కానీ అమన్‌ను వదిలి ఉండలేని హిమాన్షు ఒకసారి అమన్ కోసం అతని ఊరికి వెళ్లాడు. అక్కడ హిమాన్షుని ఘోరంగా అవమానించారు. అమన్ కూడా ఇక మీద తన వద్దకు రావద్దని హిమాన్షుతో చెప్పాడు. 


అమన్ మాటలకు హిమాన్షు చాలా బాధపడ్డాడు. అప్పటినుంచి భోజనం చేయడం మానేశాడు. టీచర్ ఉద్యోగానికి వెళ్లలేదు. ఈ క్రమంలో ఒకరోజు అమన్ ఫోన్ చేసి తనకు ఒక అమ్మాయితో పెళ్లి జరగబోతోందని చెప్పాడు. ఇది విని హిమాన్షు తట్టుకోలేక పోయాడు. అమన్ లేని జీవితం వ్యర్థం అని భావించి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హిమాన్షు మరణం గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు.  

Read more