Gurugram: స్కూటీతో సహా గుంతలో పడిన 45 ఏళ్ల వ్యక్తి.. అక్కడ తెగిపడిన వైర్ ఉండడంతో దారుణం..

ABN , First Publish Date - 2022-09-25T23:58:39+05:30 IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాలు వరదల తాకిడికి గురవుతున్నాయి.

Gurugram: స్కూటీతో సహా గుంతలో పడిన 45 ఏళ్ల వ్యక్తి.. అక్కడ తెగిపడిన వైర్ ఉండడంతో దారుణం..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాలు వరదల తాకిడికి గురవుతున్నాయి. అటు అసోంలోనూ ఇటు దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 48 గంటలుగా ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గురుగ్రామ్ (Gurugram) ముంపునకు గురైంది. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై ప్రయాణిస్తున్న వారు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. శనివారం రాత్రి ఓ 45 ఏళ్ల వ్యక్తి నీరు నిలిచిన గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. 


ఇది కూడా చదవండి..

IT కంపెనీ యజమానిని కిడ్నాప్ చేసి రూ.5 కోట్లు అడిగిన దుండగులు.. చివరకు ఏమైందంటే..


భారీగా నీరు నిలిచిపోయిన పటౌడీ రహదారిపై స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ 45 ఏళ్ల వ్యక్తి గుంతలో పడిపోయాడు. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి తెగి పడిన ఒక వైరు కారణంగా విద్యుదాఘాతానికి గురై మరణించాడు. సెక్టార్-37డి నివాసి స్వామి చోప్రా మనేసర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి అతను ఇంటికి వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. రహదారిపై తెగి పడిన విద్యుత్తు వైరులో సరఫరా నిలిచిపోకపోవడంతో స్వామి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-09-25T23:58:39+05:30 IST