Viral Video: భార్యను కాపురానికి పంపని అత్తామమలు.. అల్లుడు ఏం చేశాడంటే.. నెట్టింట వైరల్ అవుతున్న అతడి నిర్వాకం!

ABN , First Publish Date - 2022-09-22T23:17:58+05:30 IST

పుట్టింటికి వెళ్లిన భార్యను తన ఇంటికి తీసుకొచ్చుకోవడానికి అతడు అత్తామామల ఇంటికి వెళ్లాడు. అత్తామామలతో కొద్ది సమయం పలు అంశాలపై మాట్లాడి.. తన భార్యను తనతోపాటు పంపించాలని కోరాడు. అయితే.. దానికి అతడి మామ నిరాకరించాడు. తన కూతురును అల్లుడితో పంపించేదని లేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో అ

Viral Video: భార్యను కాపురానికి పంపని అత్తామమలు.. అల్లుడు ఏం చేశాడంటే.. నెట్టింట వైరల్ అవుతున్న అతడి నిర్వాకం!

ఇంటర్నెట్ డెస్క్: పుట్టింటికి వెళ్లిన భార్యను తన ఇంటికి తీసుకొచ్చుకోవడానికి అతడు అత్తామామల ఇంటికి వెళ్లాడు. అత్తామామలతో కొద్ది సమయం పలు అంశాలపై మాట్లాడి.. తన భార్యను తనతోపాటు పంపించాలని కోరాడు. అయితే.. దానికి అతడి మామ నిరాకరించాడు. తన కూతురును అల్లుడితో పంపించేదని లేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో అత్తామామలను తన దారికి తెచ్చుకోవడానికి ఆ అల్లుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అతడి నిర్వాకం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని బిలాయ్ ప్రాంతానికి చెందిన హోరీ లాల్( Hori Lal) అనే యువకుడికి కొద్ది రోజుల క్రితమే గనియారి గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన భార్యను తిరిగి తనతోపాటు తీసుకెళ్లడానికి హోరీ లాల్ తన అత్తారింటికి వెళ్లాడు. అక్కడ అత్తారింటి కుటుంబ సభ్యులతో సరదాగా కొద్ది సమయం మాట్లాడిన అతడు.. అసలు విషయాన్ని వెల్లడించాడు. తన భార్యను తనతోపాటు పంపించాలని కోరాడు. ఈ మాటలు వినడంతోనే అతడి మామ.. హోరీ లాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కూతురును అత్తారింటికి పంపను అంటూ అల్లుడితో వాదను దిగాడు. మామ నోటి వెంట ఆ మాటలు రావడంతో హోరీ లాల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. అనంతరం అతడు కూడా వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో తన కూతురుని కాపురానికి పంపను అని.. అతడి మామ తెగేసి చెప్పడంతో హోరీ లాల్ అక్కడ నుంచి వెనుతిరిగాడు. అనంతరం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 



ఊరి బయట ఉన్న 75 అడుగుల హై టెన్షన్ విద్యుత్ స్తంభం(Climbs High Tension Tower)పైకి ఎక్కాడు. అది గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. హై టెన్షన్ స్తంభాన్ని దిగాల్సిందిగా అతడిని కోరారు. అయితే.. అతడు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు హామీ ఇచ్చారు. ‘నీ భార్యను నీతో పంపించే ఏర్పాట్లు చేస్తాం’ అని అతడికి పేర్కొన్నారు. ఈ క్రమంలో హోరీ లాల్ కిందకు దిగాడు. హోరీ లాల్ స్తంభం దిగిన వెంటనే అధికారులు.. అతడిని స్టేషన్‌కు తరలించారు. ఇదే సమయంలో స్టేషన్‌కు రావాలంటూ అతడి అత్తామామలకు కూడా కబురు పంపారు. అల్లుడితో కూతురిని పంపడానికి అత్తామామలు ఎందుకు నిరాకరించారో కానీ.. హోరీ లాల్ చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో(Video) మాత్రం ప్రస్తుతం నెట్టింట హల్ చల్(Viral) చేస్తోంది. 




Updated Date - 2022-09-22T23:17:58+05:30 IST