Pakistan: కానిస్టేబుల్ ముక్కు, చెవులు కోసేసిన వ్యక్తి.. అతడి ఆగ్రహానికి కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-02T01:48:00+05:30 IST

తన భార్యను బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారం చేసిన కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు.

Pakistan: కానిస్టేబుల్ ముక్కు, చెవులు కోసేసిన వ్యక్తి.. అతడి ఆగ్రహానికి కారణం ఏంటంటే..

తన భార్యను బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారం చేసిన కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. అతడిని కిడ్నాప్ చేసి ముక్కు, చెవులు, పెదవులు కోసేశాడు. ఈ ఘటన పాకిస్థాన్‌ (Pakistan) లోని పంజాబ్‌ రాష్ట్రం ఝాంగ్‌ జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీస్‌ కానిస్టేబుల్‌ కాసిమ్‌ హయత్‌పై ముహమ్మద్‌ లిఫ్తీకర్‌ అనే వ్యక్తి తన 12 మంది స్నేహితులతో కలిసి ఈ దాడికి పాల్పడ్డాడు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 


ఇది కూడా చదవండి..

Chandigarh: బూస్టర్ డోస్ వేసుకున్న ఛండీగఢ్ వాసులకు బంపరాఫర్.. ఫ్రీ పుడ్ అంటూ ప్రకటన..


తన కుమారుడిని చంపేస్తానని బెదిరించిన కానిస్టేబుల్‌ కాసిమ్‌‌తో మాట్లాడేందుకు కొన్ని రోజుల క్రితం లిఫ్తీకర్ భార్య వెళ్లింది. అక్కడ ఆమెను కాసిమ్ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో తీశాడు. తనతో అఫైర్ కొనసాగించాలని, లేకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. కానిస్టేబుల్ వేధింపుల గురించి భార్య ద్వారా లిఫ్తీకర్‌కు తెలిసింది. ఆ కానిస్టేబుల్‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని లిఫ్తీకర్ అనుకున్నాడు. 


ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కాసిమ్‌ను 12 మందితో కలిసి లిఫ్తీకర్ అడ్డగించాడు. అతడిని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించాడు. ఆ తర్వాత చాకుతో కాసిమ్ చెవులు, ముక్కు, పెదాలు కోసేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధిత కానిస్టేబుల్‌ను ఝాంగ్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కాసిమ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. లిఫ్తీకర్‌తో పాటు అతడి స్నేహితుల గురించి పోలీసులు గాలిస్తున్నారు.   

Read more