చెల్లెలి ప్రేమ పెళ్లికి ప్రతీకారం.. నాలుగేళ్ల తర్వాత సోదరి కుటుంబ సభ్యులపై దాడి!

ABN , First Publish Date - 2022-08-03T00:22:53+05:30 IST

సోదరి ప్రేమ వివాహం చేసుకోవడంతో మనస్తాపానికి గురైన సోదరుడు నాలుగేళ్ల తర్వాత తన పగ తీర్చుకున్నాడు.

చెల్లెలి ప్రేమ పెళ్లికి ప్రతీకారం.. నాలుగేళ్ల తర్వాత సోదరి కుటుంబ సభ్యులపై దాడి!

సోదరి ప్రేమ వివాహం చేసుకోవడంతో మనస్తాపానికి గురైన సోదరుడు నాలుగేళ్ల తర్వాత తన పగ తీర్చుకున్నాడు.పేపర్ కట్టర్‌తో తన సోదరి భర్త, మావ, బావపై దాడి చేశాడు. ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిపై దాడి చేసిన వెంటనే దుండగుడు పారిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది. గ్వాలియర్‌కు సమీపంలోని ఇందర్‌గంజ్‌ శివాలయం సమీపంలో నివసించే శివమ్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి.


ఇది కూడా చదవండి..

Viral Video: హోం వర్క్ చెయ్యమన్నందుకు కుర్రాడి ఫ్రస్ట్రేషన్.. వైరల్ అవుతున్న వీడియో!


ఆదివారం రాత్రి శివమ్ భోజనం చేసి బయట నిల్చున్నప్పుడు భరత్ అనే వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. శివమ్ భార్యకు భరత్ సోదరుడు. శివమ్ నాలుగేళ్ల క్రితం భరత్ సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పట్నుంచి శివమ్, భరత్ కుటుంబాల మధ్య వైరం నెలకొంది. అలాంటిది భరత్ తన ఇంటికి రావడంతో శివమ్ ఆశ్చర్యపోయాడు. శివమ్‌పై భరత్ దాడి చేశాడు. పేపర్ కట్టర్‌తో శివమ్ చేతులు, కాళ్లను కోసేశాడు. శివమ్ అరుపులు విని అతని తండ్రి, సోదరుడు బయటకు వచ్చారు. భరత్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 


వారిపై కూడా భరత్ దాడికి తెగబడ్డాడు. దీంతో ముగ్గురి శరీరాల నుంచి తీవ్రంగా రక్తస్రావమైంది. ఆ సమయంలో భరత్ అక్కడి నుంచి పారిపోయాడు. శివమ్ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భరత్ గురించి వెతుకుతున్నారు. భరత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తన సోదరిని వివాహం చేసుకున్న శివమ్‌పై భరత్ తీవ్రమైన పగ పెంచుకున్నాడు. తాజాగా దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు. 


Read more