‘అశ్లీల ప్రకటనల వల్లే పోలీస్ జాబ్ కొట్టలేకపోయా.. రూ.75లక్షల పరిహారం ఇప్పించండి’

ABN , First Publish Date - 2022-12-09T20:34:45+05:30 IST

పోటీ పరీక్షలో జాబ్ సాధించకపోవడానికి యూట్యూబ్‌లోని ప్రకటనలే కారణం అంటూ ఆరోపణకు దిగాడు. అంతటితో ఆగకుండా ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. యూట్యూబ్ నుంచి రూ.75లక్షలను నష్టపరిహారంగా తనకు ఇప్పించాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో కోర్టు..

‘అశ్లీల ప్రకటనల వల్లే పోలీస్ జాబ్ కొట్టలేకపోయా.. రూ.75లక్షల పరిహారం ఇప్పించండి’

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువకుడు వింత వాదాన్ని ఎత్తుకున్నాడు. పోటీ పరీక్షలో జాబ్ సాధించకపోవడానికి యూట్యూబ్‌లోని ప్రకటనలే కారణం అంటూ ఆరోపించాడు. అంతటితో ఆగకుండా ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. యూట్యూబ్ నుంచి రూ.75లక్షలను నష్టపరిహారంగా తనకు ఇప్పించాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు షాకింగ్ తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌కు చెందిన కిషోర్ చౌదరి.. గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం పరీక్షలకు హాజరయ్యాడు. కానీ.. ఆ పరీక్షలో అతడు ఉద్యోగానికి సెలెక్ట్ కాలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అతడు.. సంచల నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఉద్యోగం రాకపోవడానికి యూట్యూబ్‌లోని ప్రకటనలను కారణంగా చూపిస్తూ సుప్రీం కోర్టు తలుపుతట్టాడు. ‘పోలీసు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవ్వడానికి.. ఓ యూట్యూబ్ చానల్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నాను. ఆ ఛానల్‌లో క్లాసులు వింటున్న సమయంలో పదే పదే అశ్లీల కంటెంట్‌తో కూడిన ప్రకటలు ప్రసారం అయ్యాయి. దీంతో నేను ప్రిపరేషన్‌పై కాన్సట్రేషన్ పెట్టలేకపోయాను. ఫలితంగా ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అందువల్ల.. అశ్లీల కంటెంట్‌ను పదే పదే ప్రకటన రూపంలో ప్రసారం చేసినందుకుగాను యూట్యూబ్ నుంచి రూ.75లక్షల పరిహారాన్ని ఇప్పించండి. అలాగే యూట్యూబ్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయండి’ అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

అయితే ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం రోజు ఈ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు. జస్టిస్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం.. పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అశ్లీల కంటెంట్‌తో కూడిన ప్రకటనలు ప్రసారం అవుతంటే.. వాటిని ఎందుకు స్కిప్ చేయలేదు’ అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇటువంటి పిటిషన్ల వల్లే కోర్టు అమూల్యమైన సమయం వృథా అవుతుందని అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను పబ్లిసిటీ స్టంట్‌గా పేర్కొంది. అంతేకాకుండా చౌదరీకి ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే.. యువకుడు కోర్టుకు క్షమాపణలు చెప్పడం, తల్లిదండ్రుల ఆర్థిక స్థితి గురించి వివరించడంతో ఆ మొత్తాన్ని రూ.25వేలకు తగ్గించింది.

Updated Date - 2022-12-09T20:43:53+05:30 IST