రోజు వారీ బాధ్యతలు ఓ వైపు.. కుమారుడి సంరక్షణ మరో వైపు.. ఈ తండ్రి కష్టాన్ని చూస్తే..

ABN , First Publish Date - 2022-08-26T02:17:19+05:30 IST

కొందరు కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. మరికొందరు మాత్రం కుటుంబ సభ్యుల షోషణ కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటారు. అదేవిధంగా కొందరు...

రోజు వారీ బాధ్యతలు ఓ వైపు.. కుమారుడి సంరక్షణ మరో వైపు.. ఈ తండ్రి కష్టాన్ని చూస్తే..

కొందరు కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. మరికొందరు మాత్రం కుటుంబ సభ్యుల షోషణ కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటారు. అదేవిధంగా కొందరు తండ్రులు తమ పిల్లలపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుంటే.. మరికొందరు తండ్రులు కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు. అలాంటి ఆదర్శ తండ్రుల లిస్టులో.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ముందు వరుసలో ఉంటాడు. రోజు వారీ బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. మరో వైపు కుమారుడికి సంరక్షణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు. ఈ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) జబల్‌పూర్‌‌కు చెందిన రాజేష్ అనే వ్యక్తి.. వృత్తిరీత్యా రిక్షా నడుపుతుంటాడు. ఏడాది వయసున్న కుమారుడిని భుజంపై పడుకోబెట్టుకుని.. మరోవైపు రిక్షా తొక్కుతూ ఇటీవల కనిపించాడు. కొడుకు మధ్యలో నిద్రపోవడంతో ఎక్కడ నిద్రాభంగం కలుగుతుందో అని భుజంపై పడుకోబెట్టుకుని లాలిస్తూనే.. మరోవైపు రిక్షా తొక్కుతుండడాన్ని చూసి.. స్థానికులంతా చలించిపోయారు. స్థానికులు కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజేష్ కష్టాన్ని చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. అతడికి ఆర్థిక సాయం చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. రాజేష్‌కు ఇద్దరు కుమారులు ఉండగా.. పెద్ద కుమారుడిని ఇంట్లో వదిలి.. చిన్న కుమారుడిని తనతో పాటూ తీసుకొస్తున్నాడని తెలిసింది. మధ్యప్రదేశ్‌లో కొన్ని వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో (Flood affected areas) ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మద్యం మత్తులో ఉన్న భర్తకు భోజనం తెచ్చేందుకు బయటికి వెళ్లిన భార్య.. మరుక్షణం అర్ధ నగ్నంగా ప్రత్యక్షం.. ఇంతకీ ఏం జరిగిందంటే..





Updated Date - 2022-08-26T02:17:19+05:30 IST