ఓ అమ్మాయితో ప్రేమ.. మరో అమ్మాయితో పెళ్లి.. 6 నెలల తర్వాత ఆ యువకుడు తీసుకున్న నిర్ణయమిదీ..!

ABN , First Publish Date - 2022-12-08T15:12:36+05:30 IST

ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నా అతను ప్రియురాలితో..

ఓ అమ్మాయితో ప్రేమ.. మరో అమ్మాయితో పెళ్లి.. 6 నెలల తర్వాత ఆ యువకుడు తీసుకున్న నిర్ణయమిదీ..!

తను ప్రేమించిన అమ్మాయితో కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నాడు ఒక యువకుడు. అయితే అతను తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక, పెళ్ళి చేసుకున్న అమ్మాయితో సంతోషంగా ఉండలేక తనలో తను సంఘర్షణకు లోనయ్యాడు. ఆరు నెలల తరువాత అతని నిర్ణయం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

చత్తీస్ ఘర్ రాష్ట్రం జగ్దల్ పూర్ లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. 22సంవత్సరాల హర్వీందర్ అనే అబ్బాయి 23సంవత్సరాల ప్రీతీ అనే అమ్మాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే హర్వీందర్ ఇంట్లో పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నా అతను ప్రీతితో మాట్లాడుతూనే ఉన్నాడు. అలా ఆరు నెలల కాలం గడిచిపోయింది. హర్వీందర్, ప్రీతి ఇద్దరూ మాట్లాడుకుని ఒకరోజు ఇంటి నుండి వెళ్ళిపోయారు. ఉదయాన్నే వారి వారి కుటుంబ సభ్యులకు వారు కనిపించకపోయేసరికి అందరూ కలసి ఇద్దరినీ వెతికి పట్టుకున్నారు. అందరికీ అలా దొరికిపోవడం ఇద్దరూ మళ్ళీ దూరమైపోతామనే బాధ, భయం వారిలో చోటుచేసుకుందేమో.. వారిద్దరూ కలసి మరుసటిరోజు మళ్ళీ ఇంటినుండి వెళ్ళిపోయారు.

మరుసటిరోజు ఉదయాన్నే పశువులు మేపుకుంటూ వెళుతున్న వారికి హర్వీందర్, ప్రీతి ఇద్దరూ ఉరి వేసుకుని చెట్టుకు వేలాడుతూ రైల్వే నర్సరీ దగ్గర కనిపించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని జరిగిన సంఘటనను పరిశీలించారు. వారిద్దరూ కలసి అలా చనిపోవడానకి గల కారణాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో చత్తీస్ ఘర్ లో ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని అక్కడ నమోదు అవుతున్న కేసులు స్పష్టం చేస్తున్నాయి. ఇష్టం లేకుండా పెళ్ళి చేస్తే ఇలాంటివే జరుగుతాయని ఈ సంఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-12-08T15:12:38+05:30 IST