ఘనంగా భస్మహారతి... తరలి వచ్చిన జనం!

ABN , First Publish Date - 2022-09-26T16:45:11+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని శ్రీమహాకాళేశ్వరాలయంలో...

ఘనంగా భస్మహారతి... తరలి వచ్చిన జనం!

మధ్యప్రదేశ్‌లోని శ్రీమహాకాళేశ్వరాలయంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు తలుపులు తెరిచి, భస్మహారతి నిర్వహించి, మంత్రోచ్ఛారణల నడుమ పాలు, పెరుగు నెయ్యి చక్కెరలతో పంచామృత అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం గంజాయి, గంధం, డ్రై ఫ్రూట్స్, ఆభరణాలతో మహాశివునికి ఆకర్షణీయమైన అలంకరణ చేశారు. మహాశివునికి శిరస్సుపై శేషనాగపు వెండి కిరీటం ధరింపజేశారు. పండ్లు, మిఠాయిలు సమర్పించారు. భస్మ హారతిని చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు మహాకాళేశ్వరుని ఆశీస్సులు తీసుకున్నారు. మహా నిర్వాణి అఖాడాలు భస్మ హారతి నిర్వహించారు. 
Read more