Viral News: సింహానికి ఎదురుపడిన శునకం.. అది ఏం చేసిందో మీరు అస్సలు ఊహించలేరు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-12-10T13:28:16+05:30 IST

సింహం, శునకానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. సింహమేనా ఇలా చేసిందంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలో అసలు ఆ వీడియోలో..

Viral News: సింహానికి ఎదురుపడిన శునకం.. అది ఏం చేసిందో మీరు అస్సలు ఊహించలేరు.. వైరల్ అవుతున్న వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్, సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అంతటా తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సింహం, శునకానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. సింహమేనా ఇలా చేసిందంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలో అసలు ఆ వీడియోలో ఏముంది? నెటిజన్లు ఎందుకలా కామెంట్లు పెడుతున్నారనే పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ తెల్ల సింహానికి నల్లటి శునకం ఎదురుపడింది. సాధారణంగా అయితే.. శునకాన్ని చూడగానే.. సింహం దాన్ని వేటాడుతుంది. ఇదే సమయంలో మృగరాజును చూసి శునకం కూడా అక్కడ నుంచి పరుగులు తీస్తుంది. కానీ ఆ వీడియోలు అలా జరగలేదు. శునకాన్ని చూసిన వెంటనే ఆ తెల్లటి సింహం ఆప్యాయంగా దాని దగ్గరు వెళ్లింది. శునకం తన ముందు కాలును షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా పైకి లేపగా.. సింహం సైతం తన ముందు కాలుతో శునకం కాలును పట్టుకుని ముద్దాడింది. ఈ దృశ్యాలను ఓ వైల్డ్‌లైఫ్ ఫొటో గ్రాఫర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. శునకం, సింహం రెండూ మంచి మిత్రులట. చిన్నప్పటి నుంచీ కలిసే పెరిగాయట.

Updated Date - 2022-12-10T13:31:12+05:30 IST