పుట్టిన 28 రోజులకే ఘోరం.. మంచంపై నుంచి కిందపడి కూతురు చనిపోయిందంటూ శోకాలు పెట్టిన తల్లి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-09-29T01:12:15+05:30 IST

ఆ మహిళ గతేడాది నవంబర్‌లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. పుట్టిన 28 రోజుల తర్వాత ఆ చిన్నారి మృత్యువాత పడింది.

పుట్టిన 28 రోజులకే ఘోరం.. మంచంపై నుంచి కిందపడి కూతురు చనిపోయిందంటూ శోకాలు పెట్టిన తల్లి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ఆ మహిళ గతేడాది నవంబర్‌లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. పుట్టిన 28 రోజుల తర్వాత ఆ చిన్నారి మృత్యువాత పడింది.. చిన్నారిని మంచంపై ఉంచి తాను బాత్రూమ్‌కు వెళ్లానని, తిరిగి వచ్చే సరికి కింద అచేతనంగా పడి ఉందని భర్తకు, కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే ఆ చిన్నారి గొంతుపై ఏవో గుర్తులు కనిపించడంతో పోలీసులు పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. పోస్ట్‌మార్టమ్‌లో గొంతు నులమడం వల్లే ఆ చిన్నారి చనిపోయినట్టు తేలింది. 


ఇది కూడా చదవండి..

ఆన్‌లైన్‌లో డ్రోన్ కెమేరాకు ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి.. పార్సిల్ వచ్చాక ఓపెన్ చూసి షాక్.. లోపల ఏమున్నాయంటే..


మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని నర్మదాపురంకు సమీపంలోని ఖోజన్‌పూర్‌కు చెందిన పూజ, దుర్గేష్ బడే దంపతులకు 5 ఏళ్ల కొడుకు, మూడేళ్ల కూతురు ఉన్నారు. ఏడాది క్రితం మూడో ప్రసవంలో పూజ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గతేడాది డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు ఆమె ఒంటరిగా ఇంట్లో ఉంది. భర్త, అత్తయ్య పని నుంచి తిరిగి ఇంటికి వెళ్లేసరికి చిన్నారి మరణించి ఉంది. అమ్మాయిని మంచంపై పడుకోబెట్టిన తర్వాత స్నానం చేసేందుకు వెళ్లానని, తిరిగి వచ్చి చూసే సరికి కూతురు మంచం పక్కన అచేతనంగా పడి ఉందని చెప్పింది.  పోస్ట్‌మార్టమ్‌లో అసలు విషయం బయటపడింది. చున్నీతో ఎవరో గొంతు నులిమి చంపినట్టు తేలింది. 


పోలీసుల విచారణలో పూజ అసలు నిజం అంగీకరించింది. తాము ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆ స్థితిలో ఆడ పిల్లను పెంచడం కష్టమనే భావనతో ఆ దారుణానికి ఒడిగట్టినట్టు అంగీకరించింది. దాదాపు 9 నెలలు ఆ కేసును విచారించిన కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. కన్నకూతురిని కిరాతకంగా చంపిన పూజకు జీవిత ఖైదు విధించింది. 

Read more