61ఏళ్ల మహిళ.. కిరాణా దుకాణం నడుపుతూ జీవనం.. వచ్చే ఆదాయంతో 10ఏళ్లలో 11 దేశాలు విజిట్ చేసింది!

ABN , First Publish Date - 2022-07-08T15:02:21+05:30 IST

పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం అంటే ఆమెకు చాలా ఇష్టం. కానీ.. మధ్యతరగతి కుటుంబంలో జన్మించడంతో ఆర్థిక కారణాల వల్ల.. స్కూల్‌ జీవితంలో ఎప్పుడూ తోటి విద్యార్థులతో టూర్‌కు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం స్థానికంగా

61ఏళ్ల మహిళ.. కిరాణా దుకాణం నడుపుతూ జీవనం.. వచ్చే ఆదాయంతో 10ఏళ్లలో 11 దేశాలు విజిట్ చేసింది!

ఇంటర్నెట్ డెస్క్: పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం అంటే ఆమెకు చాలా ఇష్టం. కానీ.. మధ్యతరగతి కుటుంబంలో జన్మించడంతో ఆర్థిక కారణాల వల్ల.. స్కూల్‌ జీవితంలో ఎప్పుడూ తోటి విద్యార్థులతో టూర్‌కు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం స్థానికంగా జీవనాధారం కోసం కిరాణం దుకాణం నడుపుతూ.. వచ్చిన ఆదాయంతో 10ఏళ్లలో ఏకంగా 11దేశాలు విజిట్ చేసింది. కాస్త షాకింగ్‌గా అనిపించినా ఇది నిజం. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కేరళలోని ఇరుంపనమ్ ప్రాంతానికి చెందిన మోలీ జాయ్ అనే మహిళకు ప్రస్తుతం 61ఏళ్లు. ఈమె తన భర్తతో కలసి.. Chitrapuzha(చిత్రపూజ) ప్రాంతంలో 26ఏళ్ల క్రితం ఓ కిరాణా దుకాణాన్ని (Grocery Shop) నెలకొల్పారు. అదృష్టవశాత్తు ఆ షాప్‌కు ప్రజాధరణ లభించి.. ఫేమస్‌గా మారింది. దీంతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలో 18ఏళ్ల క్రితం విషాదం చోటు చేసుకుంది. భర్తను కోల్పోయి ఒంటరయ్యారు. ఆ తర్వాత షాప్ బాధ్యతలు మొత్తం ఆమె తన భూజాలపై వేసుకున్నారు. ఒంటరి మహిళైనప్పటికీ.. షాప్‌కు ఉన్న మంచి పేరుకు మచ్చ రానివ్వలేదు.ఈ క్రమంలో షాప్ ద్వారా వచ్చిన లాభాలతో తొలుత.. ఊటీ, మైసూర్ వంటి పర్యాటక ప్రదేశాలు వెళ్లి ప్రకృతి అందాలు చూశారు. ఆ పర్యటనలు ఆమెకు ఆనందాన్ని ఇవ్వడంతో 2012లో మొదటి సారిగా పాస్‌పోర్ట్ తీసుకుని.. టూరిస్ట్ వీసా మీద యూరప్‌కు మొట్టమొదటి అంతర్జాతీయ ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఆమె తిరిగి వెనక్కి చూసుకోలేదు.. అదే పంథాను కొనసాగించారు. దీంతో గడిచిన 10ఏళ్లలో షాప్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఏకంగా 11 దేశాలను ఆమె చుట్టొచ్చారు. 


Read more