KBC Show: కేబీసీ షోలో కోటి రూపాయలు గెలిచారు కదా.. వాటితో ఏం చేస్తారు.. అని ఈ సాధారణ గృహిణిని అడిగితే..

ABN , First Publish Date - 2022-09-17T21:04:24+05:30 IST

హిందీ భాషలో ప్రసారమయ్యే `కౌన్ బనేగా కరోడ్‌పతి` (Kaun Banega Crorepati ) కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా

KBC Show: కేబీసీ షోలో కోటి రూపాయలు గెలిచారు కదా.. వాటితో ఏం చేస్తారు.. అని ఈ సాధారణ గృహిణిని అడిగితే..

హిందీ భాషలో ప్రసారమయ్యే `కౌన్ బనేగా కరోడ్‌పతి` (Kaun Banega Crorepati ) కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది క్రమం తప్పకుండా వీక్షిస్తుంటారు. ఆ కార్యక్రమంలో పాల్గొని బహుమతి గెలుచుకోవాలని కలలు కంటుంటారు. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ఆ కార్యక్రమంలో పాల్గొని భారీ బహుమతులు అందుకున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఈ కార్యక్రమాన్ని అప్రతిహతంగా నడిపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం 14వ సీజన్ ప్రసారమవుతోంది. 


ఇప్పటివరకు ఎవరూ ఈ సీజన్‌లో ఎవరూ కోటీశ్వరులు కాలేదు. అయితే త్వరలో ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో ఓ మహిళ ఆ ఘనత సాధించనుంది. ఈ మేరకు ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన కవితా చావ్లా అనే గృహిణి కోటి రూపాయలు గెలుచుకున్నట్లు అమితాబ్ ప్రకటించిన వీడియోను ప్రోమోగా రిలీజ్ చేశారు. కోటి రూపాయలు గెలిచినట్టు బిగ్ బీ ప్రకటించగానే ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రేక్షకులతో పాటు బిగ్ బి కూడా లేచి నిలబడి చప్పట్లతో ఆమెను అభినందించారు. అయితే కవిత రూ.7.5 కోట్లు గెలుచుకుంటుందో లేదో చూడాలి.


కోటి రూపాయాలు గెలిచిన కవిత తన ఆనందాన్ని పంచుకున్నారు. `కేబీసీలో పాల్గొనాలని 2000 సంవ్సతరం నుంచి ప్రయత్నిస్తున్నా. ప్రతిసారి విఫలమయ్యా. గతేడాది ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ వరకు రాగలిగా. కానీ, హాట్ సీట్‌కు చేరుకోలేకపోయా. ఈ సారి హాట్ సీట్‌లోకి వెళ్లడమే కాకుండా కోటి రూపాయలు కూడా సాధించా. ఈ డబ్బుతో నా కొడుకును ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిస్తా. రూ.7.5 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం చెప్పగలనని అనుకుంటున్నా. ఒకవేళ రూ.7.5 కోట్లు గెలుచుకుంటే ఓ బంగళా కొనుక్కుంటా, ప్రపంచ యాత్రకు వెళతాన`ని కవిత చెప్పారు. 


Updated Date - 2022-09-17T21:04:24+05:30 IST