ఆస్ట్రేలియా కంగారు మిజోరంలో ప్రత్యక్షం.. వీడని సస్పెన్స్!

ABN , First Publish Date - 2022-04-25T16:56:52+05:30 IST

ఆస్ట్రేలియా దేశం పేరు వినగానే మన..

ఆస్ట్రేలియా కంగారు మిజోరంలో ప్రత్యక్షం.. వీడని సస్పెన్స్!

ఆస్ట్రేలియా దేశం పేరు వినగానే మన మనసులో కంగారు జంతువు కనిపిస్తుంది. కంగారు ఆస్ట్రేలియా జాతీయ జంతువు. అయితే ఈ కంగారు భారత్‌కు ఎలా వచ్చిందో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అలాగే అక్కడి నుంచి ఏడువేల కిలోమీటర్లు చెంగుచెంగున ఎలా గెంతుకుంటూ వచ్చిందో తెలియక తికమకపడుతున్నారు. ఆందుకే ఆలస్యం చేయకుండా ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటీవల పశ్చిమ బెంగాల్ పోలీసులు హైదరాబాద్‌కు చెందిన చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారిద్దరూ అక్రమంగా కంగారును తమతో పాటు తీసుకువెళుతున్నారు. అయితే వారు పోలీసులతో మాట్లాడుతూ.. తాము ఆ కంగారును ఇండోర్‌లోని జూకు తరలిస్తున్నట్లు తెలిపారు.


అయితే దీనికి సంబంధించి వారి దగ్గర ఎటువంటి పత్రాలు లేవు. అయితే వీరిద్దరూ ఆ కంగారును మిజోరంలోని ఒక ప్రైవేటు పశు సంరక్షణ సంస్థ నుంచి తీసుకువచ్చారని విచారణలో వెల్లడయ్యింది. అయితే ఈ కంగారు ఆస్ట్రేలియా నుంచి ఇక్కడకు ఎలా వచ్చిందనే విషయం పోలీసులకు కూడా అంతుచిక్కలేదు. ఈ విషయమై ఇండోర్‌లోని జంతుప్రదర్శనశాల క్యూరేటర్ మాట్లాడులూ మిజోరంనకు చెందిన ఒక ఎన్జీఓ తాను విదేశీ జంతువును జూకు అప్పగించాలనుకుంటున్నట్లు తెలిపారన్నారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్ పోలీసులు 33 ఏళ్ల షేఖ్ ఇమ్రాన్, 32 ఏళ్ల షేఖ్ జావీద్‌లను అరెస్టు చేశారు. వీరిద్దరూ ఒక ట్రక్కులో కంగారు తీసుకు వెళుతూ పోలీసులకు చిక్కారు. దీంతో వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వీరు తాము ఈ కంగారును మిజోరంలోని ఒక పశు సంరక్షణ సంస్థ నుంచి కొనుగోలు చేసినట్లు కోర్టులో తెలిపారు. దానిని ఇండోర్‌లోని జూకు అప్పగించాలనుకున్నమని పేర్కొన్నారు. అయితే ఈ నిందితుల గురించి తమకు తెలియదని ఇండోర్ జూ పార్కు క్యూరేటర్ నిహార్ పారూ లేకర్ తెలిపారు. కాగా ఈ వ్యవహారంలో మరింతమంది హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు ఈ కంగారు.. ఆస్ట్రేలియా నుంచి మిజోరం ఎలా వచ్చిందనే దానిపై కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. 

Updated Date - 2022-04-25T16:56:52+05:30 IST