Justice after 28 years: అత్యాచార బాధితురాలికి 28 ఏళ్ల తర్వాత న్యాయం.. కోర్టు చుట్టూ తిరిగి తల్లికి న్యాయం చేసిన కొడుకు..

ABN , First Publish Date - 2022-08-03T02:24:59+05:30 IST

ఆ మహిళ 12 ఏళ్ల వయసులో ఉండగా అత్యాచారానికి గురైంది.. పొరుగింట్లో ఉండే ఇద్దరు వ్యక్తులు ఆమెపై ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడ్డారు..

Justice after 28 years: అత్యాచార బాధితురాలికి 28 ఏళ్ల తర్వాత న్యాయం.. కోర్టు చుట్టూ తిరిగి తల్లికి న్యాయం చేసిన కొడుకు..

ఆ మహిళ 12 ఏళ్ల వయసులో ఉండగా అత్యాచారానికి గురైంది.. పొరుగింట్లో ఉండే ఇద్దరు వ్యక్తులు ఆమెపై ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడ్డారు.. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది.. తల్లిదండ్రులు లేని బాలిక నిందితుల బెదిరింపులకు భయపడి తన మేనత్తతో కలిసి వేరే ఊరు వెళ్లిపోయింది.. అక్కడ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ బిడ్డను తన బంధువులకు దత్తత ఇచ్చి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది.. మరో బిడ్డకు జన్మనిచ్చింది.. అయితే వివాహానికి ముందే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలుసుకున్న భర్త.. భార్యను వదిలేసి వెళ్లిపోయాడు.. తల్లిపై జరిగిన అకృత్యం గురించి కోర్టులో కేసు వేసిన కొడుకు ఎట్టకేలకు విజయం సాధించాడు. 


ఇది కూడా చదవండి..

Crime: కోడలు కనిపించకపోవడంతో కొడుకుని నిలదీసిన తండ్రి.. అతడు చెప్పింది విని నివ్వెరపోయిన తండ్రి ఏం చేశాడంటే..


ఉత్తరప్రదేశ్‌లోని సదర్ బజార్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలికపై 1994లో ఈ సంఘటన జరిగింది. 12 ఏళ్ల బాలికపై పొరుగింట్లో ఉండే ఇద్దరు సోదరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికను బెదిరించి ఏడాది పాటు అత్యాచారం చేశారు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న ఆ బాలిక మేనత్త.. నిందితులను నిలదీసింది. వారు చంపేస్తామని బెదిరించడంతో భయపడి ఆ బాలికను తీసుకుని వేరే ఊరికి వెళ్లిపోయింది. అక్కడ ఆ బాలిక ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ బిడ్డను తన బంధువులకు దత్తత ఇచ్చేసింది. ఆ విషయం చెప్పకుండా ఓ యువకుడిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత మరో బిడ్డకు జన్మనిచ్చింది.


కొన్ని రోజుల తర్వాత భార్య గత జీవితం గురించి భర్తకు తెలిసింది. దీంతో ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. కాగా, తన తల్లి గురించి అసలు విషయం తెలుసుకున్న మొదటి కొడుకు న్యాయపోరాటానికి దిగాడు. తన తల్లికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏడాది క్రితం తల్లిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విషయం చాలా పాతది కావడంతో పోలీసులు నిందితులకు డీఎన్‌ఏ పరీక్ష చేయించారు. డీఎన్‌ఏ రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది. విషయం తెలుసుకున్న నిందితులిద్దరూ పరారయ్యారు. వారి కోసం అన్వేషించిన పోలీసులు సోమవారం రాత్రి 50 సంవత్సరాల నిందితుడు మొహమ్మద్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-08-03T02:24:59+05:30 IST