వాట్ ఏన్ ఐడియా.. కండోమ్‌ను ఇలా కూడా వాడొచ్చా?.. ఓ లేడీ రిపోర్టర్ ఐడియాకు నెటిజన్లు షాక్!

ABN , First Publish Date - 2022-10-04T21:21:29+05:30 IST

ప్రస్తుతం మన దేశంలోనే కాదు.. మరికొన్ని దేశాలు కూడా వర్షంలో తడిసి ముద్దవుతున్నాయి. వర్షాలే కాదు..

వాట్ ఏన్ ఐడియా.. కండోమ్‌ను ఇలా కూడా వాడొచ్చా?.. ఓ లేడీ రిపోర్టర్ ఐడియాకు నెటిజన్లు షాక్!

ప్రస్తుతం మన దేశంలోనే కాదు.. మరికొన్ని దేశాలు కూడా వర్షంలో తడిసి ముద్దవుతున్నాయి. వర్షాలే కాదు.. వరదలు వస్తున్నా కొన్ని అత్యవసర రంగాలకు చెందిన ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో జర్నలిజం ఒకటి. ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడాలో తుఫాను కారణంగా పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఫ్లోరిడా వాసుల జీవనం అస్తవ్యస్థంగా మారింది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని వివరించేందుకు లేడీ రిపోర్టర్ ప్రయత్నించింది. 


ఇది కూడా చదవండి..


న్యూస్ రిపోర్టర్ కైలా గేలర్ తుఫానును కవర్ చేస్తూ జోరు వానలోనూ, భీకర గాలిలోనూ రిపోర్టింగ్ కొనసాగిస్తోంది. అయితే వర్షం కురుస్తుండడంతో ఆమె మైక్ తడిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆమె తన మైక్ తడవకుండా ఉండేందుకు అద్భుతమైన ప్లాన్ వేసింది. ఆ మైక్‌కు కండోమ్ తొడిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. `అవును ఇది కండోమ్.. ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రిపోర్టింగ్ చేసే సమయంలో మైక్రోఫోన్ తడవకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం చేశాన`ని కైలా తెలిపింది. 

Read more