నా పిల్లలు నాకు కావాలి.. ఎవరో ఎత్తుకెళ్లారంటూ పోలీసుల ముందు ఏడ్చిందో తల్లి.. 5 రోజుల తర్వాత ఏం తేలిందంటే..

ABN , First Publish Date - 2022-09-29T02:50:41+05:30 IST

పిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తించే తల్లులను చాలా అరుదుగా చూస్తుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల సంక్షేమం కోసమే తల్లి నిత్యం ఆరాటపడుతుంటుంది. పిల్లలు లేరనే వార్త తెలిసి.. గుండె..

నా పిల్లలు నాకు కావాలి.. ఎవరో ఎత్తుకెళ్లారంటూ పోలీసుల ముందు ఏడ్చిందో తల్లి.. 5 రోజుల తర్వాత ఏం తేలిందంటే..

పిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తించే తల్లులను చాలా అరుదుగా చూస్తుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల సంక్షేమం కోసమే తల్లి నిత్యం ఆరాటపడుతుంటుంది. పిల్లలు లేరనే వార్త తెలిసి.. గుండె ఆగిపోయి మరణించిన తల్లులను ఎంతో మందిని చూశాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తల్లి.. వీరికి పూర్తి విరుద్ధం. నా పిల్లలు నాకు కావాలి, ఎవరో ఎత్తుకెళ్లారంటూ పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఐదు రోజుల తర్వాత అసలు విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ పరిధి.. బెరాసియాకు చెందిన సప్నా ధాకడ్ అనే మహిళకు కోలార్ గెస్ట్ హౌస్ సమీపానికి చెందిన మోహన్ ధాకడ్‌తో 2017లో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. ఈ క్రమంలో ఆమె 2022 సెప్టెంబర్ 7న ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. వీరికి లవ్, ఖుష్ అని పేర్లు పెట్టుకున్నారు. అంతా ఆనందంగా ఉన్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్ 23న వేకువజాము 4.30గంటలకు సప్నా తన కవల పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉన్నారు. హబీబ్‌గంజ్ హనుమాన్ మందిర్ సమీపంలోకి వెళ్లాక.. పిల్లల గొంతు నులిమి చంపేసింది. మృతదేహాలను ప్రహరీ గోడ అవతలి వైపు పడేసింది. తర్వాత ఇంటికి వెళ్లి.. పిల్లలను ఎవరో ఎత్తుకెళ్లారంటూ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. తర్వాత భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది.

RS.16 Crore Injection: ఆ ఒక్క ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు.. ఈ 20 నెలల బాలుడు బతకాలంటే మరో 4 నెలల్లోనే..


తాను పిల్లలను రోడ్డు పక్కన పడుకోబెట్టి.. బాత్రూం వెళ్లి వచ్చేలోపు కనబడలేదని చెప్పింది. దీంతో పోలీసులు ముందుగా ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చేశారు. అనంతర విచారణలో భాగంగా సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. అయితే ఎక్కడా వారికి ఆధారాలు లభించలేదు. అయితే చివరగా ఆమె ప్రయాణం చేసిన బస్సులో సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే అందులో ఆమె ఒక్కటే ఉండడం చూసి పోలీసులకు అనుమానం కలిగింది. అందులోనూ ఆమె మాటల్లో తేడా ఉండడంతో తమదైన స్టైల్లో విచారణ చేశారు. దీంతో చివరకు తానే చంపేసినట్లు అంగీకరించింది. ఆమెకు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో దయ్యం పట్టిందేమో అని.. పలుమార్లు పూజలు చేయించామని భర్త తెలిపాడు. కానీ చివరకు ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదని కుటుంబ సభ్యులంతా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

కన్నతల్లిని రాత్రి పూట నడిరోడ్డు మీద వదిలేసిన తండ్రికి.. కలలో కూడా ఊహించని షాకిచ్చిన కొడుకు.. ఆ మనవడికి హ్యాట్సాఫ్..!Read more