పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ఇద్దరు యువకులు.. ఆ పిల్ల నాదంటే నాదంటూ గొడవ.. చివరికి పోలీసులు ఆమె గురించి చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-07-10T20:11:09+05:30 IST

మధ్యతరగతికి చెందిన ఇద్దరు యువకులు.. జీవితంలో ఉన్నతంగా బతకాలని భావించారు. ఈ క్రమంలో కష్టపడి ఉన్నత చదువులు చదివారు. అనంతరం పోటీ పరీక్షల కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇతంలో వారికి ఓ విషయం తెలిసిం

పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ఇద్దరు యువకులు.. ఆ పిల్ల నాదంటే నాదంటూ గొడవ.. చివరికి పోలీసులు ఆమె గురించి చెప్పింది విని..

ఇంటర్నెట్ డెస్క్: మధ్యతరగతికి చెందిన ఇద్దరు యువకులు.. జీవితంలో ఉన్నతంగా బతకాలని భావించారు. ఈ క్రమంలో కష్టపడి ఉన్నత చదువులు చదివారు. అనంతరం పోటీ పరీక్షల కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇతంలో వారికి ఓ విషయం తెలిసింది. తామిద్దరం ఒకే అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు గ్రహించారు. దీంతో గొడవకు దిగారు. ఆ పిల్ల నాదంటే నాదంటూ కొట్టుకున్నారు. చివరికి పోలీసులు ఎంట్రీతో షాకింగ్ విషయం బయటపడింది. అధికారులు చెప్పింది విని ఆ యువకుల మైండ్ బ్లాంక్ అయింది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని జగత్‌పురా ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు కొద్ది రోజులగా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. తామిద్దరం ప్రేమించేది ఒకరినే అనే విషయం తాజాగా బయటపడింది. దీంతో ఇద్దరూ కొట్లాటకు దిగారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు.. ఇద్దరినీ అరెస్ట్ చేసి, విచారణ జరిపారు. పోలీసుల దర్యాప్తులో యువతికి సంబంధించి షాకింగ్ విషయం బయటపడింది. సదరు యువతికి.. ఈ ఇద్దరు యువకులతో సంబంధం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఆ యువతి.. ఇద్దరితో సహజీవనం చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ క్రమంలో తమ ప్రేయసి గురించి పోలీసులు చెప్పింది విని సదరు యువకులు విస్తుపోయారు. 


Read more