పాఠశాల విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు.. అధికారుల కీలక నిర్ణయం.. ఇకపై!

ABN , First Publish Date - 2022-12-02T12:20:10+05:30 IST

స్కూల్ విద్యార్థులు పాఠశాలకు సెల్‌ఫోన్లు తెస్తున్నారని అనుమానిస్తూ ఉపాధ్యాయులు పిల్లల బ్యాగులు చెక్ చేయగా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు బయటపడ్డాయి...

పాఠశాల విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు.. అధికారుల కీలక నిర్ణయం.. ఇకపై!

ఇంటర్నెట్ డెస్క్: స్కూల్ విద్యార్థులు పాఠశాలకు సెల్‌ఫోన్లు తెస్తున్నారని అనుమానిస్తూ ఉపాధ్యాయులు పిల్లల బ్యాగులు చెక్ చేయగా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు బయటపడ్డాయి. బెంగళూరులో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా.. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

కరోనా తర్వాత విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోయారు. ఈ క్రమంలోనే స్కూల్స్‌కు కూడా విద్యార్థులు ఫోన్లను తీసుకొస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అసోసియేటడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ స్కూల్స్ ఇన్ కర్నాటక(KAMS) స్పందించింది. బెంగళూరులోని పాఠశాలల్లో 8,9,10వ తరగతులు చదువుతున్న విద్యార్థుల బ్యాగులను తనిఖీలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బెంగళూరు సిటీలోని దాదాపు 80శాతం స్కూల్స్‌లో.. పిల్లల బ్యాగులను ఉపాధ్యాయులు రెండు రోజుల క్రితం అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, మద్యం, సిగరెట్లు, పెద్ద మొత్తంలో డబ్బు, సెల్‌ఫోన్లు వేరు వేరు పాఠశాల్లోని విద్యార్థుల బ్యాగుల్లోంచి బయటపడ్డాయి. దీంతో అధికారులు విస్తుపోయారు. అనంతరం సదరు విద్యార్థులను సస్పెండ్ చేయకుండా.. విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా పిల్లల ప్రవర్తనల్లో మార్పు తీసుకురావడానికి కౌన్సిలింగ్ ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారడంతో సీరియస్ అయిన KAMS తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను కట్టడి చేయడానికి ఇకపై క్రమం తప్పకుండా ప్రతి రోజూ విద్యార్థుల బ్యాగులను తనిఖీ చేయాలనే అభిప్రాయానికి వచ్చింది. అంతేకాకుండా బెంగళూరులోని పాఠశాలలు అన్నీ ఈ ఆదేశాలను అమలు పరచాలని ఆదేశించింది.

Updated Date - 2022-12-02T13:01:09+05:30 IST