కడుపులో ఉండగా ముగ్గురు.. పుట్టగానే మరో ఇద్దరు మృతి.. పెళ్లయి 13 ఏళ్లయినా అందని సంతానం.. చివరకు..

ABN , First Publish Date - 2022-07-20T20:49:09+05:30 IST

ఆ మహిళకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. పిల్లల కోసం ఆ దంపతులు ఎన్నో కలలు కన్నారు..

కడుపులో ఉండగా ముగ్గురు.. పుట్టగానే మరో ఇద్దరు మృతి.. పెళ్లయి 13 ఏళ్లయినా అందని సంతానం.. చివరకు..

ఆ మహిళకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. పిల్లల కోసం ఆ దంపతులు ఎన్నో కలలు కన్నారు.. అయితే వారి ఆశలు అంత సులభంగా నెరవేరలేదు.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతి రోజే మరణించారు.. ముగ్గురు కడుపులోనే చనిపోయారు.. పిల్లల కోసం ఆ దంపతులు లక్షలు ఖర్చు పెట్టారు.. పెద్ద పెద్ద నగరాల్లో చికిత్స తీసుకున్నారు.. చివరకు భోపాల్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స తర్వాత ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. ప్రస్తుతం ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. 


ఇది కూడా చదవండి..

తాగిన మత్తులో భార్య ఎవరో.. అత్త ఎవరో గుర్తించలేకపోయిన మందుబాబు.. చివరకు జరిగిన ఘోరమిదీ..!


మధ్యప్రదేశ్‌కు చెందిన మహ్మద్ ఇస్రార్, అతని భార్య వహీదాకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇటీవల వహీదా ఓ పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చింది. `నాకు పెళ్లయి 13 ఏళ్లయింది. పెళ్లయిన మరుసటి సంవత్సరం 8వ నెలలో సిజేరియన్ జరిగింది. కొడుకు పుట్టాడు. ఒక రోజు తరువాత ఆ బాబు మరణించాడు. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ గర్భవతినయ్యా. సమస్యలు రావడంతో డాక్టర్లు మళ్లీ 8వ నెలలోనే సిజేరియన్ డెలివరీ చేశారు. రెండోసారి కూతురు పుట్టింది. ఆమె కూడా మరుసటి రోజు మరణించింది. భోపాల్‌తో పాటు, నాగ్‌పూర్, ముంబై వంటి పెద్ద నగరాల్లోని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకున్నాం. అయినా ఫలితం కనిపించలేదు. ముగ్గురు పిల్లలు కడుపులో ఉండగానే చనిపోయార`ని వహీదా తెలిపింది. 


భోపాల్‌లోని జేపీ హాస్పిటల్‌లోని రోష్ని క్లినిక్ గురించి తెలుసుకుని వహీదా అక్కడకువ వెళ్లింది. పిల్లలు లేని వారికి అక్కడ ఉచితంగా వైద్యం చేస్తున్నారు. అక్కడ సుదీర్ఘ చికిత్స తర్వాత వహీదాకు ఒక కుమార్తె జన్మించింది. దీంతో ఆ దంపతులు చాలా సంతోష పడుతున్నారు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా తమకు ఫలితం చేకూరలేదని, చివరకు ఉచిత చికిత్స ద్వారా తమ కల నెరవేరిందని వహీదా సంతోషం వ్యక్తం చేసింది. 

Read more