రైల్లో గాఢనిద్రలో కుర్రాడు.. ఎదురుగా రైల్వే మంత్రి పంపించిన నలుగురు జవాన్లు.. కనీవినీ ఎరుగని ఘటన..!

ABN , First Publish Date - 2022-04-26T21:44:06+05:30 IST

ఆ తండ్రి తొలిసారి తన 15 ఏళ్ల కొడుకును ఒంటరిగా రైలు ఎక్కించాడు.. కొడుకు ఒంటరిగా వేరే రాష్ట్రంలో వెళుతుండడంతో

రైల్లో గాఢనిద్రలో కుర్రాడు.. ఎదురుగా రైల్వే మంత్రి పంపించిన నలుగురు జవాన్లు.. కనీవినీ ఎరుగని ఘటన..!

ఆ తండ్రి తొలిసారి తన 15 ఏళ్ల కొడుకును ఒంటరిగా రైలు ఎక్కించాడు.. కొడుకు ఒంటరిగా వేరే రాష్ట్రం వెళుతుండడంతో ఎమైనా అవసరం అయితే ఫోన్ చేయమని మొబైల్ కూడా ఇచ్చాడు.. అయితే కొద్ది సేపటి తర్వాత కొడుకు మొబైల్ స్విచ్ఛాఫ్ అయిపోయింది.. దీంతో తండ్రికి ఆందోళన మొదలైంది.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అదే సమాధానం.. అవతల కొడుకు పరిస్థితి ఏంటో అర్థం కాలేదు.. అతడిని ఎలా కాంటాక్ట్ కావాలో తెలియలేదు.. దీంతో ఆ తండ్రి తన సమస్యను నేరుగా రైల్వే మంత్రి  అశ్విన్ వైష్ణవ్‌కు ట్విటర్ ద్వారా తెలియజేశాడు.. మంత్రి తక్షణం స్పందించడంతో ఆ తండ్రి అరగంటలో తన కొడుకుతో మాట్లాడగలిగాడు. 


కర్ణాటకలోని మంగుళూరులో నివసిస్తున్న కిషన్ రావు స్వస్థలం కేరళలోని కొట్టాయం. పదో తరగతి పరీక్షలు రాసిన తన 15 ఏళ్ల కొడుకు శంతనును సెలవుల్లో తన స్వగ్రామానికి పంపించాలనుకున్నాడు. తాము వెళ్లేందుకు వీలు లేకపోవడంతో శంతను ఒక్కడినే మంగుళూరు రైల్వే స్టేషన్‌లో పరశురామ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కించాడు. చిన్నప్నట్నుంచి మంగుళూరులోనే ఉంటున్న శంతనుకు మలయాళం రాదు. దీంతో కొడుక్కి ఓ మొబైల్ ఇచ్చి ఏమైనా అవసరం అయితే కాల్ చేయమని చెప్పి శనివారం ఉదయం ఐదు గంటలకు ట్రైన్ ఎక్కించాడు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు రైలు కొట్టాయం స్టేషన్‌ చేరుకుంటుంది.  


శనివారం ఉదయం పది గంటలకు రావు తన కొడుక్కి ఫోన్ చేశాడు. అవతల ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఓ గంట తర్వాత చేసినా అదే పరిస్థితి. ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ఛాఫ్ అని వస్తుండడంతో రావులో టెన్షన్ మొదలైంది. శంతనుకు ఏమైందోనని ఆందోళన ప్రారంభమైంది. కొడుకుని ఎలా కాంటాక్ట్ చేయాలో అతనికి తెలియలేదు. చివరకు రావు తన పరిస్థితిని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్విటర్ ద్వారా తెలియజేశాడు. 15 నిమిషాల తర్వాత రైల్వే కంట్రోల్ రూమ్ నుంచి రావుకు ఫోన్ వచ్చింది. శంతనుకు సంబంధించిన పూర్తి వివరాలు కంట్రోల్ రూమ్ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాలను ఆర్పీఎఫ్ సిబ్బందికి తెలిపారు. 


పరశురామ్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11.06 గంటలకు షోరానూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ఆ స్టేషన్ ఆర్పీఎఫ్ సిబ్బంది.. శంతను ఉన్న భోగీలోకి ప్రవేశించి అతడి పేరు పిలిచారు. పోలీసులు తన పేరు పిలవడంతో నిద్రలోంచి ఉలిక్కి పడి లేచిన శంతను మొదట  భయపడ్డాడు. ఆ తర్వాత మొత్తం విషయం తెలుసుకుని తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడాడు. చిన్న పొరపాటు వల్ల ఫోన్ స్విచ్ఛాప్ అయినట్టు చెప్పాడు. ట్వీట్ చేసిన అరగంటలో తన సమస్యను పరిష్కరించిన రైల్వే మంత్రికి, సిబ్బందికి రావు కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2022-04-26T21:44:06+05:30 IST