చాణక్య నీతి: ఎవరైనా మిమ్మల్ని పదేపదే అవమానిస్తుంటే... ఈ విధంగా స్పందించండి... ఇక జన్మలో మీ జోలికి రారు!

ABN , First Publish Date - 2022-09-26T11:57:25+05:30 IST

ఆచార్య చాణక్య తాను బోధించిన జీవన విధానంలో...

చాణక్య నీతి: ఎవరైనా మిమ్మల్ని పదేపదే అవమానిస్తుంటే... ఈ విధంగా స్పందించండి... ఇక జన్మలో మీ జోలికి రారు!

ఆచార్య చాణక్య తాను బోధించిన జీవన విధానంలో... పదేపదే అవమానాలను ఎదుర్కోవడం అంటే అది మూర్ఖత్వానికి సంకేతం అని చెప్పారు. నిజానికి మిమ్మల్ని అవమానించే వ్యక్తి మీరు కలత చెందడం చూసి ఎంతో సంతోషిస్తాడు. దానిని తన వినోదంలో భాగంగా చేసుకుంటాడు. అటువంటి పరిస్థితిలో మీరు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుళ్ళిన పువ్వుల నుండి మాత్రమే దుర్వాసన వస్తుంది. వికసించిన పూలు చుట్టుపక్కల పరిసరాలకు సువాసనలను వెదజల్లుతాయి. అదేవిధంగా ఇతరులను అవమానించే వారు నిజానికి ప్రతికూల ఆలోచనలతో ఉంటారు. వారు మిమ్మల్ని మానసికంగా హింసించి ఆనందం పొందుతుంటారు. సున్నా నుండి జీవితాన్ని ప్రారంభించి శిఖరాన్ని చేరుకున్న వ్యక్తి ఎవరినీ ఎప్పుడూ కించపరచడు. ఏదైనా ఒక రంగంలో ఉన్నట్టుండి కాస్త పేరు సంపాదించడంతో అహం తలెత్తిన వ్యక్తులు మాత్రమే ఇలా చేస్తారు. ఇలాంటివారికి తెలివితేటలు అభివృద్ధి చెందవు. ఇలాంటివారిని ఎవరూ విశ్వసించరు. అలాంటి వారు తమ అహంకారం కారణంగా ఏదో ఒకరోజు తాము తీసుకున్న గోతిలో పడతారు. సాధారణంగా ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు, మీరు కూడా అదే రీతిలో వారికి సమాధానం ఇస్తే, మీకు కొంతసేపటి వరకూ మంచిపనే చేశామని అనిపిస్తుంది. 


అయితే ఇటువంటి ప్రవర్తన ఆ తరువాత మిమ్మల్ని మానసికంగా కలవరపెడుతుంది. అది చెడ్డ జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అంతేకాదు పర్యవసానంగా సమాజంలో మీ గౌరవం తగ్గుతుంది. అవమానం ఎదురైనప్పుడు తెలివిగా ప్రవర్తించే వారు చాలా తక్కువమంది ఉంటారు. అవమానం ఎదురైనప్పుడు మీరు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా, ఎటువంటి ముఖ కవళికలను చూపకుండా ఉండండి. ఉదాహరణకు ఏనుగు రోడ్డుపై వెళుతున్నప్పుడు, చాలా కుక్కలు మొరుగుతాయి. అయితే ఆ ఏనుగు వాటిని పట్టించుకోదు. అటువంటప్పుడు అక్కడున్నవారు కుక్కలను చూసి నవ్వుతారు. మీరు ఏ రంగంలో ఉన్నా పరిపూర్ణంగా కృషి చేస్తే తప్ప పేరు, గౌరవం సంపాదించలేరు. అంతవరకు మీకు తగిన గౌరవం లభించదు. ఉదాహరణకు శ్రీ కృష్ణుడు తన మామ కంసుని ఆస్థానానికి చేరుకున్నప్పుడు, కంసుడు అతనిని ఎగతాళి చేశాడు. శ్రీ కృష్ణుడు తన అతీంద్రియ శక్తిని చూపించినప్పుడు, కంసుడు కూడా తల వంచాడు. Read more