-
-
Home » Prathyekam » Husband threw wife out of the house and live with another woman but sgr spl-MRGS-Prathyekam
-
భార్యను బయటకు గెంటేసి మరో యువతితో సహజీవనం.. భార్య మరొక వ్యక్తితో కలిసి ఉంటోందని తెలిసి క్రూరత్వం!
ABN , First Publish Date - 2022-02-23T18:08:24+05:30 IST
అతను తన భార్యను వేధించి ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.. మరొక యువతిని ఇంటికి తీసుకెళ్లి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.

అతను తన భార్యను వేధించి ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.. మరొక యువతిని ఇంటికి తీసుకెళ్లి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.. ఐదేళ్లుగా భార్య ఎలా ఉందో కనీసం పట్టించుకోలేదు.. ఆమె మరొక వ్యక్తితో కలిసి ఉంటోందని తెలిసిన తర్వాత పశువులా మారాడు.. ఆమె ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డాడు.. ఆమెను కొట్టాడు.. శరీరం మీద ఉన్న బంగారం అంతా లాక్కున్నాడు.. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాజస్థాన్‌లోని భన్స్‌వారాకు చెందిన కాలా అనే మహిళ 2012లో పరమేశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత మూడేళ్లు వారు కలిసి ఉన్నారు. ఆ సమయంలో అత్తింటి వారు ఆమెను అదనపు కట్నం కోసం వేధించేవారు. ఆమె తీసుకురాకపోవడంతో 2015లో ఆమెను పరమేశ్ ఇంటి నుంచి బయటకు తరిమేశాడు. తర్వాతి రోజే మరో మహిళను ఇంటికి తీసుకెళ్లి ఆమెతో సహజీవనం ప్రారంభించాడు. ఈ ఐదేళ్లలో కాలా ఎలా ఉందనే విషయం పట్టించుకోలేదు. గతేడాది కాలా తల్లిదండ్రులు మరణించారు. దీంతో ఆమె బంధువుల్లో ఒక వ్యక్తి ఆమెకు ఆశ్రయం కల్పించాడు.
ఆ విషయం తెలుసుకున్న పరమేశ్ పశువులా ప్రవర్తించాడు. భార్య దగ్గరకు వెళ్లి ఆమెను అందరూ చూస్తుండగానే చితక్కొట్టాడు. ఆమె శరీరం మీద ఉన్న బంగారం అంతా లాక్కున్నాడు. `నిన్ను నేను తీసుకెళ్లను. నువ్వు ఎవరితోనూ ఉండకూడద`ని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. దీంతో కాలా పోలీసులను ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.