భర్తకు వడ్డించిన ఆహారంలో వెంట్రుకలు... అతను శివాలెత్తిపోతూ భార్యను పట్టుకుని ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2022-12-12T11:11:13+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక యువకుడు తాను తింటున్న ఆహారంలో తల వెంట్రుక కనిపించడంతో రాక్షసుడిగా మారిపోయి, తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.

భర్తకు వడ్డించిన ఆహారంలో వెంట్రుకలు... అతను శివాలెత్తిపోతూ భార్యను పట్టుకుని ఏం చేశాడంటే...

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక యువకుడు తాను తింటున్న ఆహారంలో తల వెంట్రుక కనిపించడంతో రాక్షసుడిగా మారిపోయి, తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. భార్యపై దాడికి తెగబడ్డాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను చేసిన ఈ నీచమైన చర్యకు అతడి కుటుంబ సభ్యులు కూడా మద్దతుగా నిలిచారు. ఆ మహిళ తన భర్తతో సహా ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళ తన భర్తకు ఆహారం వడ్డించింది. అయితే ఆ ఆహారంలో వెంట్రుకలు కనిపించాయి. వాటిని చూసిన భర్త శివాలెత్తిపోయాడు.

ఆహారంలో వెంట్రుకలు వచ్చాయని భర్త తనపై వేధింపులకు పాల్పడ్డాడని, చేతులు, కాళ్లు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి తనతో శృంగారానికి ప్రయత్నించాడని, తాను సహకరించకపోవడంతో తనకు గుండు కొట్టించాడని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త క్రూరత్వానికి పాల్పడుతుండగా, తన బావమరిది, అత్తమామలు భర్తకు సహకరించారని బాధిత మహిళ ఆరోపించింది. తన భర్త కట్నం కోసం డిమాండ్ చేస్తున్నాడని కూడా బాధిత మహిళ తెలిపింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్త, బావమరిది, అత్తామామలపై కేసు నమోదు చేశారు. బాధిత మహిళ భర్తను అరెస్టు చేశారు. ప్రస్తుతం బాధిత మహిళ తన తల్లి ఇంటిలో ఉంది.

Updated Date - 2022-12-12T11:11:13+05:30 IST

Read more