అనారోగ్యం పాలైన భార్యను పుట్టింట్లో వదిలేసిన భర్త.. ఆ మహిళ ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-11-15T16:19:41+05:30 IST

కలకాలం తోడు నీడగా ఉండాల్సిన భర్త కష్టకాలంలో మొహం చాటేశాడు.. అనారోగ్యంతో ఉన్న భార్యను పుట్టింట్లో వదిలేశాడు.. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాతే ఇంటికి రావాలని చెప్పి వదిలించుకున్నాడు.. దీంతో ఆ మహిళ..

అనారోగ్యం పాలైన భార్యను పుట్టింట్లో వదిలేసిన భర్త.. ఆ మహిళ ఏం చేసిందంటే..

కలకాలం తోడు నీడగా ఉండాల్సిన భర్త కష్టకాలంలో మొహం చాటేశాడు.. అనారోగ్యంతో ఉన్న భార్యను పుట్టింట్లో వదిలేశాడు.. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాతే ఇంటికి రావాలని చెప్పి వదిలించుకున్నాడు.. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.. భర్తపై ఫిర్యాదు చేసింది.. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలోని బండోల్‌లో ఈ ఘటన జరిగింది. సియోని జిల్లా బంకికి చెందిన కాళీ అనే మహిళకు నాలుగేళ్ల క్రితం రామ్‌కుమార్ చౌదరితో వివాహం జరిగింది.

గత కొద్ది రోజులుగా కాళీ అనారోగ్యంతో బాధపడుతోంది. డాక్టర్ దగ్గరకు వెళ్లగా కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో ఆమె తన భర్తకు పరిస్థితి వివరించి ఆపరేషన్‌కు డబ్బులు కావాలని అడిగింది. దీంతో భర్త ఆమెను వదిలించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆమెను పుట్టింటికి తీసుకెళ్లి వదిలేశాడు. తల్లిదండ్రులను డబ్బులు అడిగి అపరేషన్ చేయించుకుని తిరిగి రావాలని చెప్పాడు. కాళీ తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే. దీంతో ఏం చేయాలో తెలియక కాళీ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-11-15T16:19:41+05:30 IST

Read more