నీ కూతురు చనిపోయింది.. మీకు చెప్పకుండానే అంత్యక్రియలు కూడా చేసేశారంటూ.. ఓ వ్యక్తి ఫోన్‌కాల్.. అల్లుడిని నిలదీస్తే..

ABN , First Publish Date - 2022-08-31T20:09:08+05:30 IST

ఆ వ్యక్తి తన కుమార్తెకు రెండేళ్ల క్రితం వివాహం చేశాడు. పెళ్లి ఘనంగా చేయడమే కాకుండా..

నీ కూతురు చనిపోయింది.. మీకు చెప్పకుండానే అంత్యక్రియలు కూడా చేసేశారంటూ.. ఓ వ్యక్తి ఫోన్‌కాల్.. అల్లుడిని నిలదీస్తే..

ఆ వ్యక్తి తన కుమార్తెకు రెండేళ్ల క్రితం వివాహం చేశాడు. పెళ్లి ఘనంగా చేయడమే కాకుండా.. వివాహ సమయంలో నగదు, బైక్‌తోపాటు ఇతర వస్తువులు కానుకగా ఇచ్చాడు. అయితే భర్త, అత్తమామలు వాటితో సంతృప్తి చెందకుండా మరో రెండు లక్షల రూపాయలు కట్నంగా తీసుకురావాలని కోడలిపై ఒత్తిడి చేశారు. అందుకు ఆమె నిరాకరించడంతో చిత్రహింసలకు గురిచేస్తుండేవారు. చివరకు ఇటీవల ఆమెను సజీవ దహనం చేశారు. 


ఇది కూడా చదవండి..

Uttarakhand: పూజకు ఆటంకం కలిగించారని క్రూరత్వం.. తన కుటుంబం మొత్తాన్ని చంపేసిన వ్యక్తి..


బీహార్‌(Bihar)లోని ముజఫరాపూర్‌కు చెందిన ప్రమోద్ మహ్తో రెండేళ్ల కిందట తన కూతురు రింకీ దేవి (23)ని బజరంగీ మహతోకు ఇచ్చి వివాహం చేశాడు. వివాహ సమయంలో రూ.2 లక్షల కట్నం, బైక్, గృహపకరణాలు కట్నంగా ఇచ్చాడు. అయితే బజరంగీ, అతని తల్లిదండ్రులు వాటితో సంతృప్తి చెందకుండా మరో రూ.2 లక్షలు అదనపు కట్నంగా తీసుకురావాలని ఒత్తిడి తేవడం ప్రారంభించారు. అయితే తండ్రి ఆర్థిక పరిస్థితి బాగోలేదని రింకీ దేవి అత్త మామలకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. దీంతో వారు రింకీని చిత్రహింసలకు గురి చేశారు.


వారం రోజుల క్రితం రింకీ దేవిని సజీవ దహనం చేశారు. సాక్ష్యాధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు.  ఇరుగుపొరుగు వారు మృతురాలి తండ్రికి ఫోన్ చేసి  సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రింకీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసి కూతురి ఇంటికి చేరుకునేటప్పటికీ, అల్లుడు, అతని తల్లిదండ్రులు కనిపించకుండా పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించార. పరారీలో ఉన్న వారి కోసం అన్వేషణ ప్రారంభించారు.  

Read more