సడన్‌గా 18 నెలల కొడుకు నుంచి ఏడుపులు.. అంతలోనే నిశ్శబ్దం.. అనుమానంతో ఆ తండ్రి గదిలోకి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-04-10T08:42:22+05:30 IST

ఆ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు.. అయితే ఆ కొడుకు జననంపై తండ్రికి అనుమానం మొదలైంది. ఆ బాలుడు తనకు పుట్టినవాడు కాదని అతని నమ్మకం..

సడన్‌గా 18 నెలల కొడుకు నుంచి ఏడుపులు.. అంతలోనే నిశ్శబ్దం.. అనుమానంతో ఆ తండ్రి గదిలోకి వెళ్లి చూస్తే..

ఆ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు.. అయితే ఆ కొడుకు జననంపై తండ్రికి అనుమానం మొదలైంది. ఆ బాలుడు తనకు పుట్టినవాడు కాదని అతని నమ్మకం. అందుకే డీఎన్‌ఏ టెస్ట్ చేయించాలని భార్యను బలవంతం చేశాడు. 


రెండ్రోజుల క్రితం ఆ బాలుడు అనుమాస్పదంగా చనిపోయాడు. స్వయంగా కన్నతల్లే ఆ బాలుడిని చంపేసినట్టు విచారణలో తేలింది. భర్త డీఎన్‌ఏ టెస్ట్ చేయించాలని అడగడంతోనే కొడుకుని చంపేశానని ఆ మహిళ చెప్పడం విశేషం.


మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో బిజూరి గ్రామానికి చెందిన 26 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి తన గది నుంచి బయటకు వచ్చి కొడుకు కదలడం లేదని కుటుంబ సభ్యులకు చెప్పింది. లోపలికి వెళ్లి చూస్తే ఆ బాలుడి ముక్కు నుంచి రక్తం రావడం కనిపించింది. వెంటనే బాలుడిని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే బాలుడు మృతిచెందాడు. ఆ బాలుడి గొంతు నులిమి చంపేసినట్టు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


ఆ పసి కందుని కన్నతల్లే చంపేసి ఉండవచ్చునని.. పోలీసులకు అనుమానం కలిగింది. ఆమెను పోలీసులు ప్రశ్నించగా.. భర్త డీఎన్‌ఏ టెస్ట్ చేయించమన్నాడని, అందుకే కొడుకును హత్య చేశానని నిందితురాలు పోలీసుల ఎదుట అంగీకరించింది. తనకు దూరంగా పుట్టింట్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని, ఆమెకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త వాదిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. 


Read more