ఆ పిల్లి ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నదో ఆ దంపతులకు అర్థం కాలేదు... కానీ ఆ రోజు రాత్రి బెడ్‌పై పడుకున్నాక...

ABN , First Publish Date - 2022-10-02T13:18:15+05:30 IST

ఆ జంట రాత్రి వారి పడకగదిలో పడుకుంది. కొద్దసేపటి...

ఆ పిల్లి ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నదో ఆ దంపతులకు అర్థం కాలేదు... కానీ ఆ రోజు రాత్రి బెడ్‌పై పడుకున్నాక...

ఆ జంట రాత్రి వారి పడకగదిలో పడుకుంది. కొద్దసేపటి తరువాత భర్తకు మంచం మీద ఏదో కదులుతున్నట్లు అనిపించింది. లేచి గదిలోని లైట్ వేశాడు. మంచం మీద మీద ఉన్నదానిని చూసి హడలెత్తిపోయాడు. అమెరికాలోని వర్జీనియాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. డైలీ స్టార్ కథనం ప్రకారం 56 ఏళ్ల ఇయాన్ తన భార్య క్యాండీతో కలిసి మంచం మీద పడుకున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తన పాదాలపై ఏదో కదులుతున్నట్లు అతనికి అనిపించింది. 


అది తమ పెంపుడు పిల్లి కావచ్చని భావించాడు. అయితే లైటువేసి చూడగా అక్కడ పాము కనిపించింది. వెంటనే అతను అటవీ శాఖ బృందానికి ఫోన్ చేశాడు. వారు వచ్చి పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలివేశారు. ఆ పాము విషపూరితం కాదని అటవీశాఖ బృందం తెలిపింది. అయితే దాని కాటు హాని చేస్తుందన్నారు. తమ ఇంటిలోని పెంపుడు పిల్లి చాలా రోజులుగా వింతగా ప్రవర్తిస్తోందని, అది పామును చూసి ఉండవచ్చని ఇయాన్ తెలిపారు.

Read more