గోధుమ పిండి కోసం అత్త ఆ కుర్రాడిని పంపింది.. వాడు తిరిగొచ్చి ఆ సంగతి చెప్పగానే ఆమె పోలీసులకు ఫోన్ చేసి..

ABN , First Publish Date - 2022-07-07T17:37:08+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో నిరుద్యోగ భూతానికి...

గోధుమ పిండి కోసం అత్త ఆ కుర్రాడిని పంపింది.. వాడు తిరిగొచ్చి ఆ సంగతి చెప్పగానే ఆమె పోలీసులకు ఫోన్ చేసి..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో నిరుద్యోగ భూతానికి ఒక కుటుంబం బలయ్యింది. వారి సూసైడ్ నోట్‌లో నిరుద్యోగమే తమ మృతికి కారణమని రాసి ఉంది. హౌసింగ్ డెవలప్‌మెంట్ సెక్టార్ 10లో నివసిస్తున్న సోను శర్మ తన భార్య గీతా శర్మ, అతని కుమార్తె సృష్టి శర్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అందరూ గదిలో ఉరివేసుకున్నారని వారి చిన్న కొడుకు తన అత్తకు తెలిపాడు. ఘటనాస్థలి నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నప్పటికీ దానిలోని వివరాలను ఇంకా వెల్లడించాల్సివుంది. ఆగ్రా సీనియర్ సూపరింటెండెంట్ తమకు సూసైడ్ నోట్ లభ్యమయ్యిందని తెలిపారు. ఈడబ్ల్యుఎస్ హౌస్ నంబర్ 1046లో, 38 ఏళ్ల సోను శర్మ తన 35 ఏళ్ల భార్య మిథ్లేష్, 9 ఏళ్ల కుమార్తె సృష్టి, 9 ఏళ్ల కొడుకుతో కలిసి ఉంటున్నారు. మంగళవారం రాత్రి కుటుంబసభ్యులంతా ఒకే గదిలో నిద్రపోయారు. 


సోను కొడుకు శ్యామ్ ఉదయం ఏడు గంటలకు ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఇంటి పొరుగున ఉంటున్న ఆ కుర్రాడి అత్త  గోధుమ పిండి తీసుకురమ్మని ఆ పిల్లాడిని దుకాణానికి పంపింది. ఆ కుర్రాడు ఆమె దగ్గరకు తిరిగివచ్చి తన తండ్రి, తల్లి, సోదరి గదిలో ఉరివేసుకున్నారని చెప్పాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ లభ్యమైన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నిరుద్యోగి అని కుటుంబ భారం మోయలేకు సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2022-07-07T17:37:08+05:30 IST