ఒక వ్యక్తి తన దగ్గర ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు?... ఈ నియమాలు తెలుసుకోండి

ABN , First Publish Date - 2022-02-16T18:01:04+05:30 IST

బంగారం పెట్టుబడి సాధనంగా మారింది.

ఒక వ్యక్తి తన దగ్గర ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు?... ఈ నియమాలు తెలుసుకోండి

బంగారం పెట్టుబడి సాధనంగా మారింది. అందుకే  చాలామంది ఇప్పుడు బంగారంపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి బంగారం కొనుగోలు చేస్తున్నారు. అయితే బంగారం కొనడానికి పలు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా? బంగారం కొనుగోలు చేసే ముందు ఈ నియమాలను తెలుసుకోవడం అవసరం. బంగారాన్ని మీ వద్ద ఉంచుకోవడానికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. విదేశాల నుండి భారతదేశానికి బంగారం తీసుకురావడానికి పరిమితి ఉన్నట్లే, ఇంట్లో బంగారం ఉంచడానికి ఏదైనా పరిమితి ఉందా? అనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. ఇంట్లో బంగారాన్ని ఉంచుకోవడానికి ఎటువంటి పరిమితులు లేవు. అయితే ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందనేది న్యాయపరమైన అంశం అవుతుంది. దీనికి సమాధానం చెప్పాల్సివుంటుంది. మీ ఇంట్లో ఉంచిన బంగారానికి సంబంధించి సరైన కారణాలను చెప్పగలిగితే, మీరు మీ ఇంట్లో అధికమొత్తంలో బంగారాన్ని ఉంచవచ్చు. 


పెట్టుబడి లేదా దాని మూలాన్ని స్పష్టం చేయగలిగితే బంగారు ఆభరణాలను కలిగి ఉండటానికి ఎటువంటి అడ్డంకి లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) తెలిపింది. అయితే, ఇంట్లో లేదా బ్యాంకు లాకర్‌లో ఉంచిన బంగారాన్ని ఆదాయపు పన్నుశాఖకు తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌లో, ఆస్తులు, అప్పుల ఎంపికలో బంగారం వివరాలను నమోదు చేయాల్సివుంటుంది. వివాహిత మహిళలు 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. అవివాహిత మహిళలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల వరకు బంగారం తమ వద్ద ఉంచుకోవడానికి అనుమతి ఉంది. 

Read more