ప్రారంభమైన ఇసుక స్నానాలు... తేలికపడుతున్నామంటున్న పర్యాటకులు!

ABN , First Publish Date - 2022-07-18T17:29:36+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని చంబల్‌లో...

ప్రారంభమైన ఇసుక స్నానాలు... తేలికపడుతున్నామంటున్న పర్యాటకులు!

మధ్యప్రదేశ్‌లోని చంబల్‌లో ఇసుక స్నానాలు ప్రారంభమయ్యాయి. అది యమున, సింధు, పహుజ్ నదుల సంగమం. తెల్లవారుజామున ఐదు గంటలైంది. నల్లని మేఘాలతో కూడిన చల్లని వాతావరణం మధ్య చంబల్ ఒడ్డున ఆయుర్వేద పర్యాటకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన పురుషులు, మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు. 


ఆయుర్వేదాచార్య డాక్టర్ కమల్ కుశావహ్ ఆధ్వర్యంలో చల్లని ఇసుక స్నానాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున 32 మంది పురుషులు, మహిళలు దీనిని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కమల్ కుశావహ్ మాట్లాడుతూ ఇటువంటి రెండు రకాల స్నానాలను 30 నుంచి 35 నిమిషాలు చేయడం వలన ప్రయోజనం ఉంటుంది. అభ్యంగ క్రియతో పాటు చల్లని  ఇసుక స్నానం చేసిన ఇటావాకు చెందిన డాక్టర్ వికె అగర్వాల్ మాట్లాడుతూ తాను గతంలో బ్యాంకాక్‌లో చవిచూసిన అనుభూతిని తిరిగి పొందానని తెలిపారు. హాట్ బాత్ కోసం మహిళా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ బాత్ కారణంగా అలసట, ఒత్తిడి తగ్గుతుందని మహిళలు తెలిపారు. ఇటావా నుండి వచ్చిన శ్వేతా తివారీ మాట్లాడుతూ చంబల్‌లో మొదటిసారిగా ఇలాంటి అనుభూతి పొందడం చాలా అద్భుతంగా ఉందన్నారు. శిరోధార అనుభవమే అత్యుత్తమమని దీప అన్నారు. దీంతో  ఎప్పిటి నుంచో ఉన్న మైగ్రేన్ నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందానన్నారు.

Updated Date - 2022-07-18T17:29:36+05:30 IST