ఎన్నేళ్లయినా సరే.. నువ్వు నాకు కనిపిస్తే చంపేస్తా.. ఇదీ ప్రేమ పెళ్లి చేసుకున్న చెల్లికి ఓ అన్న వార్నింగ్.. 4 ఏళ్ల తర్వాత..

ABN , First Publish Date - 2022-10-01T20:07:52+05:30 IST

ఆ యువతి తన గ్రామానికే చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది.. కులాంతర వివాహం కావడంతో యువతి తరఫు వారు ఆ పెళ్లికి అంగీకరించలేదు..

ఎన్నేళ్లయినా సరే.. నువ్వు నాకు కనిపిస్తే చంపేస్తా.. ఇదీ ప్రేమ పెళ్లి చేసుకున్న చెల్లికి ఓ అన్న వార్నింగ్.. 4 ఏళ్ల తర్వాత..

ఆ యువతి తన గ్రామానికే చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది.. కులాంతర వివాహం కావడంతో యువతి తరఫు వారు ఆ పెళ్లికి అంగీకరించలేదు.. దీంతో ఆ యువతి తన భర్తతో కలిసి చెన్నై వెళ్లిపోయింది.. ఓ బిడ్డకు తల్లి కూడా అయింది.. అయినా తల్లిదండ్రులు, సోదరుడు ఆమెను దగ్గరకు రానివ్వలేదు.. సోదరుడు ఆమె మీద తీవ్రమైన పగ పెంచుకున్నాడు.. ఎప్పటికైనా సరే మిమ్మల్ని కాల్చి చంపేస్తానని తన సోదరికి వార్నింగ్ ఇచ్చాడు.. అన్నట్టుగానే నాలుగేళ్ల తర్వాత సోదరిని కాల్చి చంపాడు. 


ఇది కూడా చదవండి..

Jharkhand: విద్యార్థినులకు పోర్న్ వీడియోలు చూపించిన ఉపాధ్యాయుడు.. గ్రామస్థులు అతడికి ఎలా బుద్ధి చెప్పారంటే..


బీహార్‌ (Bihar)లోని నవాడాకు చెందిన ఛోటేలాల్ చౌదరి కుమార్తె చాందినీ కుమారి తన గ్రామానికే చెందిన విపిన్ కుమార్‌తో ప్రేమలో పడింది. వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో 2018లో విపిన్‌తో కలిసి చెన్నై వెళ్లిపోయి అక్కడ పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి అక్కడే ఉంటోంది. రెండేళ్ల కిత్రం ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా, చాందినీ తమ కుటుంబ పరువు తీసిందని ఆమె సోదరుడు కుందన్ చాలా కోపంగా ఉన్నాడు. కరోనా సమయంలో చాందినీ, విపిన్ నవాడాకు వెళ్లారు. చాందినీని ఎప్పుడు కలిసినా మీ ఇద్దరినీ ఎప్పటికైనా చంపేస్తానని బెదిరించేవాడు.


కరోనా సమయంలో సోదరి, ఆమె భర్త గ్రామంలోనే ఉన్నా అప్పుడు వారిని ఏమీ చేయలేకపోయాడు. ప్రస్తుతం చాందిని తన బిడ్డతో కలిసి అత్తింట్లో ఉంటోంది. ఆమె భర్త చెన్నైలో ఉన్నాడు. చాందినీ శుక్రవారం రాత్రి మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో కుందన్ దారుణానికి ఒడిగట్టాడు. చాందినీపై తుపాకీతో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో చాందినీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సదర్‌ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Read more