-
-
Home » Prathyekam » holi celebration smartphone mobile phone water damage spl-MRGS-Prathyekam
-
హోలీ వేళ.. ఫోనుపై రంగునీళ్లు పడితే ఏం చేయాలంటే..
ABN , First Publish Date - 2022-03-16T17:59:42+05:30 IST
హోలీ పండుగను ఎంజాయ్ చేయాలంటే..

హోలీ పండుగను ఎంజాయ్ చేయాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిందే.. అప్పుడు మాత్రమే మీరు హోలీని పూర్తిగా ఆనందించగలుగుతారు. ఈ రంగుల పండుగలో సరదాతో పాటు ఫోన్ టెన్షన్ కూడా వెంటాడుతుంది. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌తో హోలీ ఫోటోలు తీస్తున్నప్పుడు దానిపై నీరు పడితే ఏంచేయాలో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్ నీటిలో పడి తడిస్తే, ముందుగా దాని స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్ ఆన్‌లో ఉన్నప్పుడు ఇంటీరియర్‌లోని ఏదైనా భాగంలోకి నీరు వస్తే, షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఫోన్ నీటిలో పడిపోయినా లేదా తడిసిపోయినా, దానిలోని ఏదైనా బటన్లు పని చేస్తున్నాయో లేదో తనిఖీ చేయడానికి ప్రయత్నించకూడదని గుర్తుంచుకోండి.
అటువంటప్పుడు దాన్ని ఆఫ్ చేయడం తెలివైన పని. ఆ తరువాత ఫోనులోని ఉపకరణాలను వేరు చేయండి. అంటే, బ్యాటరీ, సిమ్ కార్డ్, మెమరీ కార్డ్‌లను పొడి టవల్‌పై ఉంచండి. ఈ అన్ని ఉపకరణాలను వేరుచేయడం వలన షార్ట్ సర్క్యూట్ ప్రమాదం తగ్గుతుంది. ఇటువంటి సందర్భంలో ఫోన్ ఆఫ్ అయ్యే వరకు పవర్ బటన్‌ను నొక్కి పట్టుకోండి. ఫోన్లోని అన్ని భాగాలను పొడిగా ఉంచడం అవసరం. టవల్‌తో తుడిచిన తర్వాత, ఫోన్ అంతర్గత భాగాలను ఆరబెట్టడం చాలా ముఖ్యం. దీని కోసం ఫోన్‌ను రైస్ పాత్రలో ఉంచండి. బియ్యం తేమను త్వరగా గ్రహిస్తుంది. ఇలాంటప్పుడు ఫోన్లోని అంతర్గత భాగాలు త్వరగా డ్రై అవుతాయి. బియ్యం పాత్రలో కనీసం 24 గంటల పాటు ఉంచాలి. తర్వాత ఫోన్ ఫోనులోని అన్ని భాగాలను తిరిగి సెట్ చేసి ఆన్ చేయండి. ఒకవేళ ఇప్పుడు కూడా ఫోన్ ఆన్ కాకపోతే సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లండి. అయితే డ్రైయర్‌తో ఫోన్‌ను ఆరబెట్టడానికి ప్రయత్నించవద్దు. డ్రైయర్ చాలా వేడి గాలిని విడుదల చేస్తుంది, ఇది ఫోన్ సర్క్యూట్లను కరిగిస్తుంది.