Hitler’s Watch: వేలంలో హిట్లర్ వాచ్.. ఎంత ధర పలికిందంటే..

ABN , First Publish Date - 2022-07-30T21:23:35+05:30 IST

చరిత్రను కాపాడుకోవడం అంత సులభం కాదు.. చారిత్రక వస్తువులను భద్రపరచడం అంటే మాటలు కాదు..

Hitler’s Watch: వేలంలో హిట్లర్ వాచ్.. ఎంత ధర పలికిందంటే..

చరిత్రను కాపాడుకోవడం అంత సులభం కాదు.. చారిత్రక వస్తువులను భద్రపరచడం అంటే మాటలు కాదు.. అందుకే అలాంటి వస్తువులకు ఎంతో డిమాండ్ ఉంటుంది.. నాజీ నియంత అడాల్ఫ్ హిట్ల‌ర్ ధ‌రించిన ఓ వాచ్‌ను (Hitler’s Watch ) తాజాగా అమెరికాలో వేలం వేశారు. ఈ వేలం (Auction) చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఆ వేలంలో హిట్లర్ వాచ్ సుమారు ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్ల (రూ. 8.7 కోట్లు)కు అమ్ముడుపోయింది. జర్మనీకి చెందిన వాచ్‌ల తయారీ సంస్థ హ్యూబర్ ఈ వాచీని తయారు చేసింది. 


ఇది కూడా చదవండి..

Viral News: వామ్మో.. కాటేసిన పామును హాస్పిటల్‌కు తీసుకెళ్లిన వ్యక్తి.. పరుగులు తీసిన జనం..!


పుట్టినరోజు కానుకగా 1933లో ఈ వాచ్‌ను హిట్ల‌ర్‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చిన‌ట్లు చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. ఆ వాచ్‌పై స్వస్తిక్ గుర్తుతో పాటు AH అనే అక్షరాలు చెక్కి ఉన్నాయి. 1933లోనే హిట్లర్ జ‌ర్మ‌నీ ఛాన్స్‌ల‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధ ముగింపు సమయంలో బెర్‌గాఫ్‌లో ఉన్న హిట్ల‌ర్ ఇంటిపై దాడి చేసిన ఫ్రెంచ్ సైనికులకు ఈ వాచ్‌ చిక్కింది. ఈ వాచ్‌ను తాజాగా మేరీల్యాండ్‌లోని అలెగ్జాండ‌ర్ హిస్టారిక‌ల్ ఆక్ష‌న్ హౌజ్‌లో వేలం వేశారు. ఒక అనామక వ్యక్తి వేలంలో రూ.8.7 కోట్లు చెల్లించి ఈ వాచ్‌ను చేజిక్కించుకున్నాడు. కాగా, ఈ వేలాన్ని యూదు నేత‌లు ఖండించారు. 

Updated Date - 2022-07-30T21:23:35+05:30 IST