మా ఆయనకు 89.. ఆ యావ చావలేదు!

ABN , First Publish Date - 2022-09-13T10:18:02+05:30 IST

వయసు మీద పడి ముసలితనం వచ్చినా.. తన భర్తలో శృంగార కోరికలు చావలేదని, ఈ వయసులో కూడా లైంగిక సుఖం కావాలంటూ తనను వేధిస్తున్నాడని గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ వృద్ధురాలు వాపోతోంది.

మా ఆయనకు 89.. ఆ యావ చావలేదు!

వడోదర, సెప్టెంబరు 12: వయసు మీద పడి ముసలితనం వచ్చినా.. తన భర్తలో శృంగార కోరికలు చావలేదని, ఈ వయసులో కూడా లైంగిక సుఖం కావాలంటూ తనను వేధిస్తున్నాడని గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ వృద్ధురాలు వాపోతోంది. తన భర్త వేధింపులు తట్టుకోలేక సహాయం కోసం 181 (అభయం) హెల్ప్‌లైన్‌కు కాల్‌చేసింది. ఆ వృద్ధురాలి వయసు 87 ఏళ్లు కాగా.. ఆమె భర్తకు 89 సంవత్సరాలు. ఇంజనీరుగా పనిచేసి రిటైరైన ఆయన ఇప్పటికీ సెక్స్‌ కోసం డిమాండ్‌ చేస్తున్నాడని.. తాను అలసిపోయానని, ఆరోగ్యం బాగోలేదని చెప్తే తనపై గట్టిగా అరుస్తూ, కోపగించుకుంటున్నాడని ఆమె హెల్ప్‌లైన్‌ అధికారులకు తెలిపింది. ఆమె ఆవేదన విన్న అభయం అధికారులకు తొలుత ఏం చేయాలో పాలుపోలేదు. అనంతరం షాక్‌ నుంచి తేరుకుని.. వారి ఇంటికి చేరుకుని భర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. యోగాభ్యాసం చేస్తూ, కాస్త గుళ్లూగోపురాలకు తిరగాలని.. సాయంత్రాలు పార్కుకు వెళ్లి తోటి వృద్ధులతో కాలం గడపాలని, తద్వారా శృంగారం నుంచి మనసు మళ్లుతుందని ఆయనకు సూచించారు.

Read more