పాపకు జన్మనిచ్చిన 9 రోజులకే ఓ తల్లికి కడుపుకోత.. నామకరణ వేడుక చేస్తుండగా జరిగిన ఒక్క ఘటనతో..

ABN , First Publish Date - 2022-09-02T23:58:23+05:30 IST

ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది.. తొమ్మిది రోజుల క్రితం జన్మించిన బాలిక నామకరణ మహోత్సవం

పాపకు జన్మనిచ్చిన 9 రోజులకే ఓ తల్లికి కడుపుకోత.. నామకరణ వేడుక చేస్తుండగా జరిగిన ఒక్క ఘటనతో..

ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది.. తొమ్మిది రోజుల క్రితం జన్మించిన బాలిక నామకరణ మహోత్సవం సందర్భంగా బంధువులందరూ వచ్చారు.. కార్యక్రమం చాలా కోలాహలంగా జరుగుతోంది.. ఇంతలో అనుకోని ఘోరం సంభవించింది.. ఇంటి పైకప్పు కూలిపోయింది.. ఈ ఘటనలో ఆ చిన్నారి మరణించింది.. పది మందికి పైగా గాయాల పాలయ్యారు.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.


ఇది కూడా చదవండి..

అత్తారింట్లో కనీసం గౌరవం లేదంటూ కోపం.. అందరిలోనూ అవమానించాడని బామ్మర్దిపై పగ.. చివరకు ఎంతకు తెగించాడంటే..


ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్థానికులు పోలీసుల సహాయంతో క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 12 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. చిన్నారి మృతి గురించి తెలుసుకుని తల్లి, అమ్మమ్మ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. గాయాలపాలైన వారిని ఈ వార్త మరింత కుంగదీసింది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. 

Read more