వర్షమొచ్చినా.. పిడుగులు పడ్డా సరే.. లేచేదే లేదంటున్న అతిథులు.. Viral అవుతున్న Video..

ABN , First Publish Date - 2022-07-06T02:48:34+05:30 IST

కొందరు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇంకొందరు చేసే పనులు భలే తమాషాగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ Funny..

వర్షమొచ్చినా.. పిడుగులు పడ్డా సరే.. లేచేదే లేదంటున్న అతిథులు.. Viral అవుతున్న Video..

కొందరు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇంకొందరు చేసే పనులు భలే తమాషాగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ Funny incident కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో అతిథులంతా భోజనం చేస్తుండగా.. సడన్‌గా పెద్ద వర్షం వస్తుంది. దీంతో అంతా లేచి పరుగుందుకుంటారు. కానీ కొందరు అలాగే వర్షంలో కూర్చుని, చివరి వరకూ భోజనం చేసే తీరు.. నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తోంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో అతిథులంతా కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు. మధ్యలో భారీ వర్షం మొదలవుతుంది. దీంతో అక్కడున్న వారంతా లేచి పరుగు పరుగున సమీపంలోని భవనంలోకి వెళ్తారు. అయితే కొంతమంది మాత్రం అక్కడి నుంచి లేవరు. ఎలాగైనా భోజనం పూర్తయ్యే వరకూ లేవకూడదు అనుకున్నారో.. ఏమో గానీ.. ఓ వైపు తింటూనే, మరో వైపు కుర్చీని తలపై బోర్లించుకుని మరీ భోజనం కొనసాగించారు. తినడం పూర్తయ్యే వరకూ అక్కడి నుంచి లేవలేదు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఆకలి మనిషితో ఏమైనా చేయిస్తుంది.. అని కొందరు, ఆహార ప్రియుల్లో వీళ్లే నంబర్ ఒన్.. అని మరికొందరు, ఆహారంపై మక్కువ అంటే ఈ మాత్రం ఉండాలి మరి.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చూసిన ఏనుగు.. చివరికి ఏం చేసిందో చూడండి..

Updated Date - 2022-07-06T02:48:34+05:30 IST

Read more