పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లిన వరుడు.. తలుపు దగ్గర పోలీసులను చూసి దిగ్భ్రాంతి.. విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-02-23T18:32:28+05:30 IST

ఆ యువకుడు ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్నాడు.. వివాహం తర్వాత కొత్త పెళ్లికూతురితో కలిసి తన ఇంటికి వెళ్లాడు..

పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లిన వరుడు.. తలుపు దగ్గర పోలీసులను చూసి దిగ్భ్రాంతి.. విషయం ఏంటంటే..

ఆ యువకుడు ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్నాడు.. వివాహం తర్వాత కొత్త పెళ్లికూతురితో కలిసి తన ఇంటికి వెళ్లాడు.. సంతోషంగా ఇంటి ముందు కారు దిగిన అతడికి ఊహించని షాక్ తగిలింది.. అప్పటికే అక్కడున్న పోలీసులు వరుడుని అరెస్ట్ చేశారు.. వరుడిపై ఓ యువతి అత్యాచార కేసు పెట్టిందని చెప్పి వరుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు.. దీంతో బంధువులందరూ షాకయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


జష్‌పూర్‌కు చెందిన అనిరుధ్ అనే వ్యక్తి నాలుగేళ్లుగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. పెళ్లి పేరుతో ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ కూడా చేయించాడు. చివరకు మాట తప్పాడు. వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ నెల 20న మరో యువతిని వివాహం చేసుకున్నాడు. 21వ తేదీన ఊరేగింపుగా వధువుతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. 


అప్పటికే బాధిత యువతి అనిరుధ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 21వ తేదీన అనిరుధ్ ఇంటి దగ్గర కాపు కాశారు. ఊరేగింపుగా అతను రాగానే విషయం చెప్పి అరెస్ట్ చేశారు. పోలీసుల ఎదుట అనిరుధ్ నిజం అంగీకరించాడు. 

Read more