ఇంట్లోంచి పారిపోయిన ప్రేమ జంట.. సడన్‌గా మనసు మార్చుకున్న యువతి.. రైల్లో ఆమె చేసిన పనితో ప్రియుడికి మైండ్ బ్లాక్..!

ABN , First Publish Date - 2022-05-13T20:27:53+05:30 IST

ఆ యువతి, యువకుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి ఉండాలని బాసలు చేసుకున్నారు. విషయం ఇంట్లో చెప్పి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే అది వీలు పడలేదు. దీం

ఇంట్లోంచి పారిపోయిన ప్రేమ జంట.. సడన్‌గా మనసు మార్చుకున్న యువతి.. రైల్లో ఆమె చేసిన పనితో ప్రియుడికి మైండ్ బ్లాక్..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతి, యువకుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి ఉండాలని బాసలు చేసుకున్నారు. విషయం ఇంట్లో చెప్పి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే అది వీలు పడలేదు. దీంతో ఆ ప్రేమికులు ఇంట్లోంచి పారిపోయి రైలెక్కారు. ఈ క్రమంలోనే సడన్‌గా యువతి తన మనసు మార్చుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన పనికి ప్రియుడికి మైండ్ బ్లాంకైంది. ఇంతకూ యువతి ఏం చేసింది, తర్వాత ఆ ప్రేమజంట పరిస్థితి ఏమైంది అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


బిహార్‌లోని సీతామర్హి జిల్లాకు చెందిన సబీనా, రవి శంకర్ అనే యువతీయువకుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చావైనా, బతుకైనా కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించారు. తమ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారి పెళ్లికి కుటుంబ పెద్దలు నిరాకరించారు. దీంతో ఆ ప్రేమ జంట కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లోంచి పారిపోయి.. కలిసి బతకాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లేందుకు స్థానికంగా ఉన్న రైల్వే స్టేషన్‌కు ఆ ప్రేమికులు వెళ్లారు. ఢిల్లీ వెళ్లే రైల్లో కూర్చున్న అనంతరం ఏమైందో ఏమో కానీ సడన్‌గా సబీనా తన మనసు మార్చుకుంది. ట్రైన్‌లో నుంచి కిందకు దూకేసి, పరుగు ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా రవి శంకర్ షాకయ్యాడు. వెంటనే తాను కూడా ట్రైన్ నుంచి కిందకు దిగేసి.. సబీనాను ఆగమని కోరుతూ ఆమె వెనకాలే పరుగు తీశాడు. అది చూసి స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి.. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

Read more