తన బాయ్‌ఫ్రెండ్ వేరే మహిళతో ఉన్నట్టు కల వచ్చింది.. తెల్లవారు ఝామున వెళ్లి చూసే సరికి..

ABN , First Publish Date - 2022-03-16T22:30:51+05:30 IST

తెల్లవారు ఝామున వచ్చిన కొన్ని కలలు నిజమవుతాయని అంటుంటారు.

తన బాయ్‌ఫ్రెండ్ వేరే మహిళతో ఉన్నట్టు కల వచ్చింది.. తెల్లవారు ఝామున వెళ్లి చూసే సరికి..

తెల్లవారు ఝామున వచ్చిన కొన్ని కలలు నిజమవుతాయని అంటుంటారు. చాలా మంది అలాంటి వాటిని పట్టించుకోరు. అయితే తనకు వచ్చిన కలను సీరియస్‌గా తీసుకున్న ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ నిజ స్వరూపాన్ని తెలుసుకుంది. తనకు వచ్చిన కల ఆధారంగా తెల్లవారు ఝామున నాలుగు గంటలకు బాయ్‌ఫ్రెండ్ రూమ్‌కు వెళ్లింది. అక్కడ అతను మరో యువతితో నిద్రపోతూ కనిపించాడు. ఆ యువతి తన కథను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 


బ్రిటన్‌కు చెందిన జామీ అనే యువతి కొంతకాలంగా ఒక వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇద్దరూ వేర్వేరు ఇళ్లలో నివసించేవారు. ఈ క్రమంలో జామీని తరచుగా ఓ కల వేధించడం మొదలుపెట్టింది. తన ప్రేమికుడు మరో స్త్రీతో ఉన్నట్టు జామీకి కల వచ్చేది. మొదట ఆ కలను కొట్టి పారేసిన జామి ఆ తర్వాత సీరియస్‌గా తీసుకుంది. తెల్లవారు ఝామున తన బాయ్‌ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్టుగానే ఒకరోజు ఉదయం నాలుగు గంటలకు బాయ్‌ఫ్రెండ్ రూమ్‌కు వెళ్లిపోయింది. 


తన దగ్గర ఉన్న తాళం చెవితో ఫ్లాట్‌ లోపలికి ప్రవేశించింది. బెడ్రూమ్‌లో పరిస్థితి చూసి నోరెళ్లబెట్టింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ నిజంగానే మరో యువతితో కలిసి నిద్రపోతూ జామీ కంటపడ్డాడు. దీంతో తన బాయ్‌ఫ్రెండ్‌కు జామీ బ్రేకప్ చెప్పేసింది. తన కథను సోషల్ మీడియాలో జామీ పోస్ట్ చేసింది. ఏదో తప్పు జరుగుతోందని మీకు అనిపిస్తుంటే, దానిని విస్మరించవద్దని జామీ సూచించింది. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి జాగ్రత్త పడాలని పేర్కొంది. 

Read more