శభాష్ అర్పణ.. చడీచప్పుడు కాకుండా మెడలోని చైన్‌ను కొట్టేసి పారిపోతున్న ఇద్దరు యువకుల వెంట పరుగులు తీసి మరీ..

ABN , First Publish Date - 2022-10-07T00:08:06+05:30 IST

తన మెడ గొలుసు లాక్కుని పారిపోతున్న ఇద్దరు దుండగులకు ఆ యువతి సరైన బుద్ధి చెప్పింది..

శభాష్ అర్పణ.. చడీచప్పుడు కాకుండా మెడలోని చైన్‌ను కొట్టేసి పారిపోతున్న ఇద్దరు యువకుల వెంట పరుగులు తీసి మరీ..

తన మెడలోని గొలుసు లాక్కుని పారిపోతున్న ఇద్దరు దుండగులకు ఆ యువతి సరైన బుద్ధి చెప్పింది.. వెంటాడి పట్టుకుని వారి తాట తీసింది.. చేతులు కట్టేసి వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లింది.. ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్న వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియో స్థానికంగా బాగా వైరల్ అవుతోంది. ఆ యువతి ధైర్యాన్ని సాధారణ ప్రజలే కాదు.. పోలీసులు కూడా మెచ్చుకుంటున్నారు. బీహార్‌లోని ముంగేర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

అన్నంలో విషం పెట్టారన్న తల్లిదండ్రులు.. అనారోగ్యంతోనే చనిపోయిందన్న అత్తమామలు.. పెళ్లయిన 6 నెలలకే ఘోరం వెనుక..


దుర్గాపూజ సందర్భంగా గురువారం ముంగేర్‌లో జరిగే జాతర చూసేందుకు భాగల్‌పూర్‌కు చెందిన అర్ఫణ అనే యువతి వెళ్లింది. జాతరలో దుర్గా దేవి హారతి కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. అర్పణ అక్కడ దుర్గా దేవికి నమస్కరిస్తోంది. ఆ సమయంలో తన మెడలోంచి ఎవరో బంగారు గొలుసు లాగుతున్నారని ఆమెకు అర్థమైంది. వెనక్కి తిరిగి చూసే సరికి ఇద్దరు అబ్బాయిలు ఆమె చైన్ లాక్కొని పారిపోతున్నారు. అర్పణ చూస్తూ ఊరుకోకుండా వారిద్దరినీ వెంబడించి పట్టుకుంది. కాలర్లు పట్టుకుని వారిద్దరినీ కొట్టింది. 


ఇద్దరి చేతులు కట్టేసి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు లాక్కెళ్లింది. అక్కడ వారిపై ఫిర్యాదు చేసి అప్పగించింది. ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్న వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియో స్థానికంగా బాగా వైరల్ అవుతోంది. పోలీసులు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. 

Read more